NTV Telugu Site icon

Iran: ఒకే రోజు ముగ్గురు మహిళలకు ఉరిశిక్ష.. వాళ్లు చేసిన నేరం ఏంటో తెలుసా..?

Iran

Iran

Iran Executes 3 Women In Single Day: ఇరాన్ లో ఇటీవల కాలంలో వరసగా ఉరిశిక్షలు అమలు చేస్తోంది. గతంలో దోషులుగా తేలిన వారిని జైళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో ఉరిశిక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. తాజాగా ఈ వారంలో రోజుల్లో ఒకే రోజులో ముగ్గురు మహిళలను ఉరితీసింది ఇరాన్ ప్రభుత్వం. ఈ ఉరిశిక్షల పట్ల నార్వేకు చెందిన ఇరాన్ మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. జూలై 27న వేర్వేరు కేసుల్లో తమ భర్తలను చంపిన నేరం కింద ముగ్గురు మహిళలను ఇరాన్ లోని వివిధ జైళ్లలో ఉరితీశారు. 2022లో ఇరాన్ ప్రభుత్వం మొత్తం 10 మంది మహిళలను ఉరి తీసింది.

15 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్న సోహీలా అబేడి.. పెళ్లయిన 10 ఏళ్ల తరువాత ఆమె భర్తను హత్య చేసిందనే ఆరోపణల్లో దోషిగా తేలిందని.. పశ్చిమ ఇరాన్ లోని సనందాజ్ నగరంలోని జైలులో ఉరితీశారు. భర్తను హత్య చేసిన కేసులో ఐదేళ్ల క్రితం దోషిగా తేలిన ఫరానాక్ బెహెష్టిని వాయువ్య నగరం ఉర్మియాలోని జైలులో ఉరితీశారు. ఇదే విధంగా ఆఫ్ఘన్ జాతీయురాలు అయిన సెనోబర్ జలాలీని టెహ్రాన్ జైలులో ఉరితీశారు.

Read Also: Top-3: టాప్‌-3 కంపెనీలు.. టాప్‌-3 సంపన్న మహిళలు..

ఇదిలా ఉంటే వరసగా ఉరిశిక్షలను అమలు చేస్తుండటంపై ఇరాన్ పై హక్కుల సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కనీసం మహిళలు గృహహింస వంటి సందర్భాల్లో కూడా ఏకపక్షంగా విడాకులు కోరుకునే హక్కు అక్కడి మహిళకు లేదు. ఇరాన్ చట్టాలు మహిళా హక్కులకు ఏమాత్రమ ప్రాధాన్యం ఇవ్వలేదని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. గత ఏడాది అక్టోబర్ లో ఇరాన్ హ్యుమర్ రైట్స్ నివేదికలో 2010 నుంచి అక్టోబర్ 2021 మధ్య కనీసం 164 మంది మహిళలకు ఇరాన్ ఉరిశిక్షలు విధించింది. ఒక్క 2022 నుంచి ఇప్పటి వరకు 306 మందిని ఉరి తీసింది. ఇరాన్ జీవించే హక్కును ఉరిశిక్షతో అంతం చేస్తోందని వాషింగ్టన్ కు చెందిన అబ్డోరాహ్మన్ బోరోమాండ్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కు బుధవారం తెలిపింది.