NTV Telugu Site icon

Israel-Hamas war: ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా ఇరాన్ దాడి చేసే ఛాన్స్: అమెరికా

Iran

Iran

Israel-Hamas war: ఇజ్రాయెల్‌ దేశంపై ఇరాన్, హిజ్బుల్లాలు ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని అగ్ర దేశం అమెరికా అంచనా వేసింది. దీనిపై జీ- 7 దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమాచారాన్ని అందించినట్లు టాక్. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడికి పాల్పడక ముందే, ఇజ్రాయెల్ స్వయంగా ఇరాన్‌పై దాడికి దిగే ఛాన్స్ ఉందని ఇజ్రాయెల్‌ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Read Also: Bangladesh Protest : బంగ్లాదేశ్ జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు.. భారత్ లో హై అలర్ట్

కాగా, దాడి చేయకుండా ఇరాన్‌ను నిరోధించేందుకు ఇజ్రాయెల్ ఏ నిర్ణయమైనా తీసుకునే ఛాన్స్ ఉందని ఆ దేశ న్యూస్ ఛానెళ్లలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఇరాన్ దాడి భయం చుట్టుముట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఎలాంటి వైఖరిని తీసుకోవాలనే దానిపై చర్చించేందుకు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం తాజాగా కీలక భేటీని నిర్వహించినట్లు సమాచారం. ఇందులో మోసాద్, షిన్ బెట్ విభాగాల అధిపతులు డేవిడ్ బర్నియా, రోనెన్ బార్, రక్షణ మంత్రి యోవ్ గల్లంట్, ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జి హలేవి హాజరయ్యారు.