Site icon NTV Telugu

Iran Attacks Oil Tanker: ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. నౌకలో భారతీయులు

Oil Tankar (1)

Oil Tankar (1)

Iran Attacks Oil Tanker: అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. దీంతో ఈ యుద్ధ మరింత తీవ్రంగా మారింది. ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, సౌదీ, కువైట్, ఖతార్‌లపై దాడులు చేస్తోంది. మధ్యప్రాచ్యంలోని యూఎస్ మిలిటరీ స్థావరాలపై క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది.

Read Also: Ayatollah Arafi: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అరాఫీ నియామకం..

ఇదిలా ఉంటే, చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘ హార్ముజ్ జలసంధి’’ని మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ జలసంధి గుండా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది. పలావు జెండా ఉన్న చమురు ట్యాంకర్ ఒమన్‌లోని ముసాందం ద్వీపకల్పాన్ని దాటుతుండగా ఢీకొట్టింది. ఈ దాడిలో కనీసం నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ నౌకలో 15 మంది భారతీయులు, ఐదుగురు ఇరానియన్ జాతీయులు ఉన్నారు. ఒమన్ వాణిజ్య నౌకాశ్రయం దుక్మ్‌పై డ్రోన్ దాడులు జరిగిన తర్వాత ఈ సంఘటన జరిగిందిజ

ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC) ప్రకారం..‘‘ఆయిల్ ట్యాంకర్ పేరు స్కైలైట్, 15 మంది భారతీయులు, ఐదుగురు ఇరానియన్ పౌరులు సహా 20 మంది సిబ్బందితో ప్రయాణిస్తోంది. ముసాందంలోని ఖాసబ్ ఓడరేవు నుండి ఐదు నాటికల్ మైళ్ల దూరంలో దాడి జరిగింది. దాడి తర్వాత సిబ్బందిని ఖాళీ చేయించారు.’’ అని తెలిపింది.

Exit mobile version