Site icon NTV Telugu

Paris Olympics: పారిస్‌లో ముఖేష్ అంబానీ దంపతుల సందడి.. ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ

Parisolympics

Parisolympics

అంతర్జాతీయ ఒలంపిక్స్ గేమ్స్ పారిస్‌లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ప్రపంచ దేశాల నుంచి అతిథులు హాజరయ్యారు. ఈ ప్రారంభ వేడుకలకు ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు నీతా అంబానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖేష్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌, ఐవోసీ అధ్యక్షుడు థామస్ ఘనంగా ఆహ్వానించారు. ఈఫిల్ టవర్‌లో దగ్గర నీతా దంపతులు దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జూలై 26న అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఒలంపిక్స్ గేమ్స్ ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. అయితే ఈ గేమ్స్‌ను అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతుందన్న నిఘా హెచ్చరికలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Exit mobile version