NTV Telugu Site icon

International Yoga Day: ప్రాచీన భారతం నుండి ప్రపంచం వరకు.. చారిత్రక మూలాలు..

Inter Natinal Yoga Day 2024

Inter Natinal Yoga Day 2024

International Yoga Day: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రతి ఏటా జూన్ 21 న జరుపుకునే యోగా దినోత్సవానికి ప్రాచీన భారతదేశం నుండి ప్రపంచ సాధన వరకు ప్రాముఖ్యత ఉంటుంది. ఆరోగ్యపరంగా యోగా యొక్క విశిష్టతను గుర్తించి 2014లో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆరోగ్యం, శ్రేయస్సు కోసం యోగా ప్రయోజనాలను చెబుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలోచనను ప్రతిపాదించారు. భారతదేశంలో 5,000 సంవత్సరాల క్రితం యోగా ఉద్భవించింది.ఇది శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానాన్ని మిళితం చేస్తుంది. రుగ్వేదం వంటి ప్రాచీన గ్రంథాలు యోగాభ్యాసాలను, వివిధ సంప్రదాయాలు, ఆలోచనల ద్వారా పుట్టుకొచ్చింది. ఇక యోగా 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది.

Read also: Mukhesh Ambani : ముఖేష్ అంబానీ డీప్‌ఫేక్ వీడియో.. రూ.7లక్షలు మోసపోయిన మహిళా వైద్యురాలు

స్వామి వివేకానంద, బీకేఎస్ అయ్యంగార్ వంటి ప్రభావవంతమైన వ్యక్తులు యోగాను పశ్చిమ దేశాలకు వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు లక్షలాది మంది యోగాను దాని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం అభ్యసిస్తున్నారంటే ఇదంతా వారి పుణ్యమే అని చెప్పవచ్చు. దీంతో.. ఆధునిక యోగా వివిధ జీవన విధానాలకు అనుగుణంగా మారింది. యోగాలో హఠ, విన్యాస, అష్టాంగ వంటి విభిన్న శైలులు ఉన్నాయి. యోగా స్టూడియోలు, ఆన్‌లైన్ తరగతులు అన్ని వయసుల వారికి ఫిట్‌నెస్ కోసం అందుబాటులో ఉంటున్నాయి. కాగా.. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యక్రమాల ద్వారా గుర్తించబడింది.

Read also: World Music Day: పాటలు వినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

పార్కులు, కమ్యూనిటీ సెంటర్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలందరూ కలిసి యోగా సాధన చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు ఐక్యత, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు సమాజం అంతా ఒక్కటే అనే సంకేతాలు పంపుతాయి. అయితే ప్రాచీన భారతదేశం నుంచి ఒక సంప్రదాయంగా వస్తున్న యోగా ఇప్పుడు ప్రపంచ నలుమూలలకు వ్యాపించింది. ఇక.. పాశ్చాత్య దేశాల్లో యోగాను రెగ్యులర్ ప్రాక్టీస్‌గా చేస్తుంటారు. దీంతో ఎక్కువ మంది ప్రజలు యోగాపై ఆశక్తి చూపించడం వలన దాని ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా జీవితాలను సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి.
IND vs AFG: ఆ తప్పిదమే మా ఓటమికి కారణం: రషీద్ ఖాన్