Site icon NTV Telugu

‘ఊబెర్ ఈట్స్’ సరికొత్త రికార్డు.. అంతరిక్షంలో ఫుడ్‌ డెలివరీ..

ఆఫీసులోనో.. ఇంట్లోనో.. కూర్చొని.. నచ్చిన ఫుడ్‌, మెచ్చిన హోటల్‌ నుంచి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లో ఆర్డర్‌ చేస్తే.. కోరుకున్న చోటుకే ఫుడ్‌ వచ్చేస్తోంది.. ఇదంతా ఏ సిటీ, టౌన్‌లోనే అయితేనే సాధ్యం.. కానీ, ఆ హద్దులు చెరిపేసి.. అంతరిక్షంలోనూ ఫుడ్‌ డెలివరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది ‘ఊబెర్‌ ఈట్స్‌’ ఫుడ్‌ డెలివరీ యాప్‌.. అయితే, అంతరిక్షం నుంచి ఆర్డర్‌ రావడం ఏంటి..? ఆ ఆర్డర్‌ ఎలా డెలివరీ చేశారు..? అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా సాగింది..

Read Also: చిన్నారులపై ఒమిక్రాన్‌ పడగ..! ముప్పు తప్పదా..?

అంతరిక్షంలో ఫడ్‌ డెలివరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్త ప్రదేశాలను వెళ్లాలని, ప్రపంచాన్నే చుట్టేయలని ఎందరికో ఉంటుంది.. కొందరు తమ కోరికలను నేరవేర్చుకోవడానికి ఎంతైనా శ్రమిస్తారు.. ఇక, డబ్బులు ఉన్నవారి అయితే.. అది పెద్ద సమస్యే కాకపోవచ్చు.. అయితే, జపాన్ బిలియనీర్ యుసాకు మేజావాకు అంతరీక్ష ప్రయాణం అంటే ఎంతో ఇష్టం.. కొన్ని వందల కోట్లు పెట్టి ఆయన ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కాలు పెట్టి తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారాయన.. ఈ సందర్భాన్నే ఊబెర్ ఈట్స్‌ ఉపయోగించుకుని అంతరిక్షంలోకి ఫుడ్‌ డెలివరీ చేసింది.. ఎలా అంటే..? ఈ నెల 11వ తేదీన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు యుసాకు మేజావా.. ఆయనతో పాటే ఊబెర్ ఈట్స్ నుంచి కొన్ని ఆహార పదార్థాలు కూడా అంతరిక్షంలోకి వెళ్లాయి.. ఆయన అంతరిక్షంలోకి చేరుకున్న 9 గంటల తర్వాత ఊబెర్ ఈట్స్ ఫుడ్‌ను.. అది కూడా ఊబెర్ ఈట్స్ క్యాప్ పెట్టుకుని మరీ అక్కడి వ్యోమగాములకు అందించారు. మొత్తంగా ఓ బిలియనీర్‌ సహాయంతో అంతరిక్షంలోనూ ఫుడ్‌ డెలివరీ చేసి సరికొత్త చరిత్రను సృష్టించింది ఊబెర్‌ ఈట్స్‌.. ఇక, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఊబెర్‌ ఈట్స్.. మేం ఎక్కడికైనా చేరుకుంటాం.. ఏదైనా డెలివరీ చేస్తాం… ఇది ప్రారంభం మాత్రమే అంటూ కామెంట్‌ పెట్టింది.. ఊబెర్‌ ఈట్స్‌ షేర్‌ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..

Exit mobile version