NTV Telugu Site icon

InSight lander: మూగబోనున్న ఇన్‌సైట్ ల్యాండర్.. అంగారకుడిపై చివరి రోజులు

Insight Lander

Insight Lander

InSight lander mission will come to an end in the coming weeks: అంగారకుడి గురించి ఎన్నో వివరాలను అందించిన ఇన్‌సైట్ ల్యాండర్ మరికొన్ని రోజుల్లో మూగబోనుంది. 2018లో అంగారకుడిని చేరుకున్న ఇన్‌సైట్ ల్యాండర్ అంగారకుడి అంతర్గత పొరల్లో నిర్మాణాలను, అంగారకుడిపై వచ్చే మార్స్‌క్వేక్‌లను( అంగారకుడిపై భూకంపాలు) గుర్తించింది. ఇప్పటి వరకు 1,300 కంటే ఎక్కువ మార్స్‌క్వేక్‌లను గుర్తించింది ఇన్‌సైట్ ల్యాండర్. అంగారుకుడిపై నాలుగు సంవత్సరాలుగా ఇన్‌సైట్ ల్యాండర్ పనిచేస్తోంది.

ఇదిలా ఉంటే కొన్ని రోజుల్లో ఇది పనిచేయడం నిలిచిపోనుంది. అంగారకుడిపై ఉన్న దుమ్ము ల్యాండర్ సోలార్ ప్లేట్లను కప్పేసింది. దీన్ని తొలగించేందుకు నాసా చేసిన ప్రయోగాలన్ని విఫలం అయ్యాయి. దీంతో కొన్ని వారాల్లో ల్యాండర్ మూగబోనుంది. ఇది పనిచేసే కొన్ని రోజుల్లో మరింతగా డేటా సేకరించేందుకు నాసా ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారు. ఇంజనీర్లు వీడ్కోలు చెప్పేందుకు సన్నాహాలను ప్రారంభించినట్లు ఇన్ సైట్ ఒక ట్వీట్ లో పేర్కొంది. సోలార్ ప్యానెల్స్ పూర్తిగా దుమ్ముతో పేరుకోకపోవడంతో బ్యాటరీలను ఛార్జ్ చేయలేకపోతోంది. రాబోయే కొన్ని వారాల్లో ఇన్‌సైట్ ల్యాండర్ మిషన్ ముగియనుంది.

Read Also: Darren Sammy: విండీస్ బోర్డు ఇచ్చే డబ్బుతో కిరాణా సామాను కూడా కొనలేం

ఇన్‌సైట్‌ ల్యాండర్ అంగారకుడి అంతర్గత పొరలు, దాని లిక్విడ్ కోర్ గురించిన విలువైన వివరాలను శాస్త్రవేత్తలకు అందించింది. అంగారకుడిపై అయాస్కాంత క్షేత్రం ఎలా అంతరించిపోయిందనే వివరాలను, విషయాలను అణ్వేషించింది. ఇప్పటి వరకు అనేక మార్స్‌క్వేక్‌లను కనుక్కుంది. అతిపెద్దది 5 తీవ్రతగా నమోదు చేసింది. ఇటీవల మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ సహాయంతో అంగారక గ్రహంపై ఉల్కాపాతం సంభవించిన ప్రదేశాన్ని గుర్తించింది. ల్యాండర్ వేగంగా తన శక్తి కోల్పోతుండటంతో ఇతర సైన్స్ పరికాలను ఆఫ్ చేసి కేవలం సిస్మో మీటర్ మాత్రమే పనిచేసేలా చూస్తున్నారు. అంగారకుడి చుట్టూ తిరుగుతున్న స్పేస్ క్రాఫ్ట్ లతో వరసగా రెండు కమ్యూనికేషన్ సెషన్స్ కోల్పోతే ల్యాండర్ మిషన్ అయిపోయినట్లు నాసా ప్రకటిస్తుంది.