Indonesia’s Merapi Volcano Erupts: ఇండోనేషియాలో మెరాపి అగ్నిపర్వతం శనివారం బద్దలైంది. దీని ప్రభావంతో ఏడు కిలోమీటర్ల మేర ధూళి మేఘాలు కమ్ముకున్నాయని ఆ దేశా వివత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇండోనేషియాలోని యొగ్యకర్తా ప్రాంతంలో ఉన్న మెరాపి అగ్నిపర్వతం స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు విస్పోటనం చెందింది. 1.5 కిలోమీటర్ల మేర లావా ప్రవాహాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిపర్వతం నుంచి మూడు నుంచి 7 కిలోమీటర్ల పరిధిలోని ప్రజల కార్యకలాపాలు నిలిపివేయాలని ప్రభుత్వం హెచ్చరించింది.
Read Also: Japan: పిల్లల్ని ఎలా కనాలో నేర్పుతున్న నగరం.. ఎగబడి వెళ్తున్న జపాన్ ప్రజలు!
2,963 మీటర్ల ఎత్తు ఉన్న మెరాపి ఇండోనేషియాలో అత్యంత చురుకైన అగ్నిపర్వాతాల్లో ఒకటిగా ఉంది. దేశంలోనే అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వాతాల్లో మెరాపి ఒకటిగా ఉంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ లో ఉంది ఇండోనేషియా. చాలా వరకు దేశం అగ్నిపర్వతాలపైనే ఉంది. మెరాపి చివరిసారిగా 2010లో తీవ్ర విస్పోటనం చెందింది. ఈ ప్రమాదంలో 350 మందికి పైగా మరణించారు. ఇదే కాకుండా ఇండోనేషియా సముద్ర అంతర్భాగంలో కూడా చాలా అగ్నిపర్వాతాలు ఉన్నాయి. వీటి విస్పోటనాల వల్ల ఆ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. మరోవైపు ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంది. 2004లో ఇండోనేషియా సమీపంలో వచ్చిన సునామీ, భూకంపానికి ఈ టెక్టానిక్ ప్లేట్ యాక్టివిటీయే కారణం. 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి సునామీ అలలు ఎగిసిపడ్డాయి. ఈ విపత్తులో హిందూ మహాసముద్రంలోని దేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.