NTV Telugu Site icon

India’s Cuisine: ప్రపంచంలో అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్‌కు ఐదోస్థానం

Indian Food

Indian Food

India’s Cuisine Ranked Fifth In The List Of Best Cuisines Of The World: ప్రపంచ అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ ఐదోస్థానంలో నిలిచింది. టేస్ట్ అట్లాస్-2022 ప్రపంచ అత్యత్తమ వంటకాల ర్యాంకులను ప్రకటించింది. పదార్థాలు, వంటకాలు, పానీయాలు ఇలా మూడు కేటగిరీల్లో ప్రజల నుంచి ఓట్లను కోరింది. ఓట్ల ఆధారంగా ర్యాంకును కేటాయించింది. ఈ జాబితాలో ఇటలీ మొదటిస్థానంలో నిలవగా.. గ్రీస్, స్పెయిన్, జపాన్ దేశాల తర్వాత ఐదోస్థానంలో భారత్ చేరింది. మొత్తంగా భారతదేశం 4.54 పాయింట్లను సాధించింది.

Read Also: Drone Crash: మెట్రో ట్రాక్‌పై డ్రోన్ క్రాష్.. పోలీసుల హై అలర్ట్..

దేశంలో అత్యుత్తమ ఆహారాల్లో గరం మసాలా, మలాయ్, నెయ్యి, బటర్ గార్లిక్ నాన్, కీమా అత్యుత్తమ రేటింగ్ పొందాయి. భారతీయ వంటకాలను టేస్ట్ చేయడానికి ఉత్తమమైన రెస్టారెంట్లుగా శ్రీ థాకర్ భోజనాలయ్ (ముంబై), కరవల్లి (బెంగళూరు), బుఖారా (న్యూఢిల్లీ), దమ్ పుఖ్త్ (న్యూఢిల్లీ), కొమోరిన్ (గురుగ్రామ్)లతో పాటు 450 ఇతర రెస్టారెంట్లు జాబితాలో స్థానం సంపాదించాయి.

మెక్సికో, టర్కీ, యూఎస్ఏ, ఫ్రాన్స్, పెరు దేశాలు టాప్ 10 స్థానాల్లో నిలిచాయి. చైనీస్ వంటకాలు 11వ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాతో కూడిన ట్వీట్ ప్రపంచాన్ని ఆకర్షించింది. 15 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. 36 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే ఈ ర్యాంకింగ్స్ ను కొంతమంది సమర్థించడం లేదని కామెంట్ చేశారు. కొంతమంది తమదేశం వంటకాలు ఇతర దేశాల వంటకాల కన్నా గొప్పగా ఉంటాయని చెబుతున్నారు. కొందరు మొరాకో, ఇథియోపియా, మయన్మార్ దేశాల ఆహారాలు కూడా బాగుంటాయని కామెంట్ చేశారు. లెబనాన్, పాకిస్తాన్, థాయ్ లాండ్, జమైకా దేశాలు టాప్ -10లో ఉండాలి అని వ్యాఖ్యానించారు.