Indians In Sudan Asked To Stay Indoors Amid Army-Paramilitary Clash: సూడాన్ మరోసారి సంక్షోభంలోకి వెళ్లింది. అక్కడ ఆర్మీ, పారా మిలిటరీ మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఇరు బలగాలు పరస్పరం దాడులు జరుపుకుంటున్నాయి. సుడాన్ రాజధాన ఖార్టూమ్ కాల్పుల చప్పుళ్లతో దద్దరిల్లుతోంది. ఇదిలా ఉంటే సూడాన్ లో ఉన్న భారతీయులకు, ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలని, ఇంటికే పరిమితం కావాలని, బయటకు వెళ్లడం మానేయాలని సూచించింది. అప్డేట్స్ కోసం వేచి ఉండాలని ట్వీట్ చేసింది.
Read Also: Harry Brook: ఒకే దెబ్బకు మూడు పిట్టలు.. చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్
పారామిటిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్)ని సాధారణ సైన్యంలో ఏకీకృతం చేయడంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దేశంలో ఆర్మీ చీఫ్ గా ఉన్న అబ్దెల్ ఫత్తా అల్ బుర్షాన్, అతని తర్వాత నెంబర్ 2గా ఉన్న పారామిలిటరీ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య వారాల తరబడి తీవ్ర ఉద్రిక్తతల తర్వాత శనివారం సూడాన్‌లో హింస చెలరేగింది. ఖార్టూమ్ లోని ఆర్ఎస్ఎఫ్ స్థావరం దగ్గర తీవ్ర ఘర్షణ హింస చెలరేగింది. ఈ రెండు దళాలు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
సైనిక నాయకుడు అయిన బుర్హాన్, తన తర్వాతి స్థానంలో ఉన్న ఆర్ఎస్ఎఫ్ కమాండర్ తో కలిసి దేశాన్ని పౌర పాలన వైపు తీసుకెళ్లేందుకు, 2011 తిరుగుబాటుతో దేశంలో రేకెత్తించిన సంక్షోభాన్ని ముగించడానికి ఒక ఒప్పందానికి ఖరారు చేయడానికి చర్చలు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ చర్చల్లో విభేదాలు రావడంతో ఘర్షణ మొదలైంది. ఆర్ఎస్ఎఫ్ రాజధాని నగరంలో పాటు ఇతర నగరాల్లో కూడా తన బలగాలను సమీకరించుకుంటోందని సైన్యం ఆరోపించింది. దేశాన్ని రక్షించేందుకు సైన్యం సిద్ధం అవుతోందని అధికారులు చెబుతున్నారు.