మనం ఉద్యోగం సంపాదన అంత సులువైన పనికాదు. అదికూడా ప్రభుత్వ ఉద్యోగమంటే తలకిందులుగా తపస్సు చేయవల్సిందే. కొన్ని సంవత్సరాలు కఠోర శ్రమ, రాత్రింబగళ్లు కష్టపడి చదివితే తప్ప.. ఉద్యోగం వరించదు. ఇవ్వన్నీ కాకుండా ఓ పది నెలల చిన్నారికి ఏకంగా రైల్వే ఉద్యోగం లభించింది. ఇది రైల్వే చరిత్రలోనే బహుశా తొలిసారి అనే చెప్పాలి. 10 నెలల చిన్న వయసు పసికందుకు ఉద్యోగం ఇవ్వడం ఇదే మొదటిసారి అయ్యి ఉంటుంది.
అయితే ఈ చిన్నారికి రైల్వే ఉద్యోగం ఎలా వరించింది అనేప్రశ్న మనకు మెదడులో తిరుగుతోంది కదూ.. వివరాల్లోకెళ్తే, ఛత్తీస్ గఢష్ట్రానికి చెందిన సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రాయ్పూర్ రైల్వే డివిజన్ అరుదైన కారుణ్య నియామకం జరిగింది. అయితే.. పది నెలల రాధిక అనే బాలికకు కారుణ్య నియామకం కింద రైల్వే అధికారులు బుధవారం రైల్వే ఉద్యోగం కోసం రిజిస్ట్రేషన్ చేశారు. కాగా.. నిబంధనల ప్రకారం చిన్నారికి 18 ఏళ్లు నిండిన తర్వాత రైల్వే శాఖ ఆ ఉద్యోగాన్ని ఇవ్వనుంది.
అయితే.. నిజానికి, రాధిక తండ్రి రాజేంద్ర కుమార్ యాదవ్ భిలాయ్లోని పీపీ యార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. కాగా.. జూన్ 1న రాజేంద్ర కుమార్ తన కుటుంబంతో కలిసి భిలాయ్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో రాజేంద్ర.. అత భార్య మంజు యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరి పాప రాధిక మాత్రమే ఈ ప్రమాదం నుంచి బయటపడింది. అయితే.. తల్లిదండ్రులను కోల్పోయిన రాధికను అమ్మమ్మ పెంచుతుంది. ఈనేపథ్యంలో.. నిబంధనల ప్రకారం ఇటీవల రాజేంద్రకుమార్ స్థానంలో ఆయన కూతురు రాధికకు కారుణ్య నియమకానికి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేశారు. కాగా.. స్పంధించిన అధికారులు రాధికకు 18 యేళ్లు నిండాక రైల్వేలో ఉద్యోగం ఇస్తామని, ఈ మేరకు కారుణ్య నియామకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. దీంతో ఈ చిన్నారికి 18 యేళ్లు నిండగానే రైల్వే ఉద్యోగం వరించనుంచి.
Anand Mahindra: నెటిజెన్ ప్రశ్నకు.. మనసుకు హత్తుకునేలా మహీంద్రా పోస్ట్..