NTV Telugu Site icon

Qantas Flight: ఫ్లైట్‌లో అస్వస్థత.. ప్రాణాలు విడిచిన భారత సంతతి యువతి

Died

Died

భారత సంతతికి చెందిన మన్‌ప్రీత్ కౌర్(24) విమానంలో కన్నుమూసింది. గత నెల 20న ఈ సంఘటన జరిగింది. మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీకి క్వాంటాస్ విమానంలో బయలుదేరగా.. టేకాఫ్‌కు ముందే ఆమె సీటు దగ్గరే ప్రాణాలు వదిలింది. నాలుగేళ్ల తర్వాత మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీకి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: మీరు సీఎం..సీఎం అంటే నాకు భయమేస్తోంది..

మన్‌ప్రీత్ కౌర్ ఆస్ట్రేలియాలో ఉంటుంది. అయితే భారత్‌లో ఉన్న కుటుంబాన్ని చూసేందుకు నాలుగేళ్ల తర్వాత ప్రయాణం పెట్టుకుంది. అయితే మెల్‌బోర్న్‌లో క్వాంటాస్ ఫ్లైట్ ఎక్కింది. అంతకముందే ఆమె అస్వస్థతకు గురైంది. అయితే కొంచెం ఆరోగ్యం కుదిటపడడంతో విమానం ఎక్కింది. అయితే విమానం కొద్దిసేపట్లో టేకాఫ్ అవ్వబోతుందనగా సీటు దగ్గర అపస్మారకస్థితిలో పడి ఉంది. అప్పటికే ఆమె ప్రాణాలు వదిలినట్లుగా ఆమె స్నేహితుడు తెలిపాడు. తుల్లామరైన్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Team India: బార్బడోస్ లో చిక్కుకున్న టీం ఇండియా..అసలేం జరిగిందంటే?

ఇదిలా ఉంటే విమాన సిబ్బంది అత్యవసర వైద్య సహాయం అందించడానికి ప్రయత్నించినట్లు క్వాంటాస్ ప్రతినిధి తెలిపారు. ఆమె క్షయవ్యాధితో మరణించి ఉండవచ్చునని పేర్కొన్నారు. ఆమె చెఫ్ కావాలనుకుందని ఆమె రూమ్మేట్ గురుదీప్ గ్రేవాల్ తెలిపాడు. ఆమె కుటుంబానికి డబ్బును సేకరించే భాగంగా సోషల్ మీడియాలో ఫండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఆమె కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశాడు.

ఇది కూడా చదవండి: Aadi Srinivas : కేసీఆర్‌ వాస్తవాలను దాచి పెట్టాలనుకునే ప్రయత్నం చేశారు.. 

Show comments