Site icon NTV Telugu

US: డల్లాస్‌లో ఘోరం.. భారత సంతతి వ్యక్తి హత్య.. తల నరికి చెత్తకుప్పలో విసిరివేత

Us

Us

అగ్ర రాజ్యం అమెరికాలో రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మారణహోమం సృష్టిస్తున్నారు. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య మరువక ముందే మరో హత్య కలకలం రేపుతోంది. భారత సంతతికి చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య(50) అత్యంత దారుణ హత్యకు గురయ్యాడు. భార్య, కొడుకు ముందే హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

డల్లాస్‌లో ఒక మోటల్‌లో చంద్రమౌళి మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతని దగ్గర కోబోస్-మార్టినెజ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. వాషింగ్ మెషీన్ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మోటల్‌లో నిందితుడు మార్టినెజ్ గదిని శుభ్రం చేస్తుండగా విరిగిపోయిన వాషింగ్ మెషీన్ ఉపయోగించొద్దని చంద్రమౌళి చెప్పాడు. అయితే ఈ విషయాన్ని ఒక మహిళాతో చెప్పించడంతో మార్టినెజ్‌కు కోపం తెప్పించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతే మార్టినెజ్ కత్తి తీసుకుని చంపేందుకు ప్రయత్నించాడు. దీంతో చంద్రమౌళి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.. అయినా కూడా వెంటపడి పదే పదే కత్తితో పొడిచాడు. అదే సమయంలో భార్య, కొడుకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా కత్తితో పొడవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం తల నరికి చెత్త కుప్పలో పడేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: 2 నెలల తర్వాత రాష్ట్రపతి భవన్‌లో జగదీప్ ధన్‌ఖర్ ప్రత్యక్షం

చంద్రమౌళి హత్యపై భారత కాన్సులేట్ ఎక్స్‌లో స్పందించింది. హత్య తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించింది. బాధిత కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.

Exit mobile version