Indian Origin Man Balesh Dhankar Found Guilty In Harassment Cases: పైన పటారం లోన లొటారం అన్నట్టు.. పైకి జెంటిల్‌మేన్‌లాగా కనిపించే ఆ వ్యక్తిలో లోపల కామాంధుడు అనే మృగం దాగి ఉన్నాడు. మాయమాటలు చెప్పి అమ్మాయిల్ని తన వలలో పడేసేవాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. ఆకృత్యాలకు పాల్పడ్డాడు. డ్రగ్స్ ఇచ్చి మరీ.. మహిళలపై అత్యాచారాలకు ఎగబడ్డాడు. తనకు రాజకీయ నేపథ్యం కూడా ఉండటంతో.. తాను చేసే నేరాల నుంచి బయటపడొచ్చని బరి తెగించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు యువతులపై.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. చివరికి ఆ కామాంధుడి పాపం పండింది. పోలీసులకు అతడు అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు ఆస్తులన్ని అమ్ముకొని రోడ్డున పడ్డ అతగాడ్ని.. కోర్టు దోషిగా తేల్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Flights Safe Land: గాల్లో అంతరాయం.. రెండు విమానాలకు తప్పిన ప్రమాదం
ఆ కామాంధుడి పేరు భలేశ్ ధన్‌ఖడ్. ఆస్ట్రేలియాలోని భారత సంతతి కమ్యూనిటీలో అతనికి మంచి పేరుంది. గతంలో అతడు ఆస్ట్రేలియాలో భారత్‌కు చెందిన ఒక రాజకీయ పార్టీ కోసం పని చేశాడు. కొరియన్ సినిమాలు, కొరియన్ మహిళల పట్ల ఆకర్షితుడైన భలేశ్.. వారిని అనుభవించాలని ఒక పథకం రచించాడు. 2017లో కొరియన్ అనువాదకులు కావాలంటూ ఒక నకిలీ ఉద్యోగ ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి.. కొందరు కొరియన్ యువతులు అతడ్ని సంప్రదించారు. ఈ క్రమంలోనే అతగాడు మాయమాటలు చెప్పి.. యువతులకు గాలం వేశాడు. మొదటగా.. వారిని ఒక హోటల్‌కి తీసుకెళ్లి, అక్కడే ఇంటర్వ్యూ చేసేవాడు. అనంతరం డిన్నర్‌కి పిలిచేవాడు. ఎంతైనా ఉద్యోగం ఇచ్చేవాడు కదా.. అతని మాటలు వినక తప్పదు కాబట్టి, భలేశ్ చెప్పినట్టు ఆ యువతులు డిన్నర్‌కి వెళ్లేవారు. అలా వచ్చిన వారికి వైన్ లేదా ఐస్‌క్రీమ్‌లో డ్రగ్స్ కలిపి ఇచ్చేవాడు. వాళ్లు అపస్మారక స్థితిలో వెళ్లాక.. అత్యాచారానికి ఒడిగట్టేవాడు. అంతేకాదు.. ఆ దృశ్యాలను రికార్డ్ చేసేవాడు కూడా! బెడ్ పక్కనే ఉండే అలారం క్లాక్‌లోనూ ఒక కెమెరా అమర్చి, ఆ ఆకృత్యాలను రికార్డ్ చేశాడు.
Tollywood: ఈ వీకెండ్ థియేటర్ లో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే!
భలేశ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. 2018లో పోలీసులు అతని అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహించారు. అప్పుడు పోలీసులకు పదుల సంఖ్యలో వీడియోలు లభ్యమయ్యాయి. ఆ వీడియోల్లో కొందరు యువతులు అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. వాటిని దాచిన ఫోల్డర్లకు కొరియన్ మహిళల పేర్లు పెట్టాడు. అతని కేసుని విచారించిన సిడ్నీ డౌనింగ్ సెంటర్ కోర్టు.. సోమవారం భలేశ్‌ని అత్యాచార కేసుల్లో దోషిగా తేల్చింది. సిడ్నీ చరిత్రలోనే నీచమైన రేపిస్ట్‌గా అక్కడి మీడియా సంస్థలు భలేశ్‌ని అభివర్ణించాయి. ఈ కేసులో చట్టపరమైన ఖర్చుల కోసం.. భలేశ్ తన కుటుంబ ఆస్తులన్నింటినీ అమ్ముకోవాల్సి వచ్చింది. అతనికి ఈ ఏడాది చివర్లో శిక్ష ఖరారు చేయనున్నారు. ఎంచక్కా భార్యతో తన జీవితాన్ని సంతోషంగా గడపకుండా.. తమ కామవాంఛ తన జీవితంతో పాటు ఎందరో యువతల జీవితాల్ని నాశనం చేశాడు భలేశ్.