Site icon NTV Telugu

US: గగనతలంలో దారుణం.. విమానంలో ఘర్షణ.. వీడియో వైరల్

Usflite

Usflite

గగనతలంలో దారుణం జరిగింది. విమానం గాల్లో ఉండగా ప్రయాణికులు ఘర్షణకు దిగారు. అంతటితో ఆగకుండా భారత సంతతికి చెందిన ప్రయాణికుడి.. తోటి ప్రయాణికుడి గొంతు కోసే ప్రయత్నం చేశాడు. సహచర ప్రయాణికులు వారిస్తున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ ఘటనతో విమానంలో ఉన్న ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Rayachoti Terrorists: ఉగ్రవాదుల ఇళ్లలో మరోసారి తనిఖీలు.. వస్త్ర వ్యాపారం ముసుగులో..!

జూన్ 30న ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో న్యూయార్క్ చెందిన భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మ (21) ప్రయాణిస్తున్నాడు. విమానం ఫిలడెల్ఫియా నుంచి మయామి విమానాశ్రయానికి వెళ్తోంది. ఏమైందో ఏమో తెలియదు గాని.. శర్మ ఎదుట సీటులో ఉన్న కీను ఎవాన్స్‌తో గొడవకు దిగాడు. అంతేకాకుండా అతడి గొంతు బిగించేశాడు. దీంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అంతటితో ఆగకుండా అతడి గొంతు కోసేశాడు. సహచర ప్రయాణికులు బెంబేలెత్తిపోయి.. ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఏ మాత్రం తగ్గలేదు.

ఇది కూడా చదవండి: Video : 12 గంటల్లో 1,113 మంది పురుషులతో సె*క్స్ చేసిన మహిళ

అయితే ఈ దాడి వెనుక ఎటువంటి కవ్వింపులు లేనట్లుగా తెలుస్తోంది. తనకు కేటాయించిన సీటు దగ్గరకు వెళ్తుండగా తన మెడను పట్టుకున్నాడని ఎవాన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శర్మ గురించి విమాన సిబ్బందికి తెలియజేశానని.. అత్యవసర బటన్ నొక్కమని చెప్పారని పేర్కొన్నాడు. శర్మ తనను చంపుతానని బెదిరించాడని వాపోయాడు. ఇక మయామి విమానాశ్రయంలో విమానం దిగగానే శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘర్షణలో శర్మకు కూడా గాయాలయ్యాయి. అతని కంటిపై గాయాలు అయినట్లు కనిపించాయి.  ఇక మంగళవారం కోర్టుకు శర్మ హాజరయ్యాడు. ఈ సందర్భంగా శర్మ న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ ధ్యానం చేస్తున్నాడని.. దురదృష్టవశాత్తు శర్మ వెనుక సీటు ప్రయాణికుడికి నచ్చలేదని పేర్కొన్నాడు.

 

Exit mobile version