Indian Man On Board New York-Delhi Flight Pees On Co-Flyer: ఈమధ్య గాల్లో ఎగురుతున్న విమానాల్లో తరచూ విచిత్ర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేస్తున్న సందర్భాలే ఎక్కువగా తెరమీదకొస్తున్నాయి. తాజాగా అలాంటి జుగుస్పాకరమైన ఘటనే ఒకటి వెలుగు చూసింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో న్యూయార్క్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఓ భారతీయుడు.. తోటి ప్రయాణికుడపై మూత్రం పోశాడని సమాచారం. అతడు తాగిన మత్తులో తోటి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడని, ఈ క్రమంలోనే కోపంలో మూత్రం పోసినట్లు తెలిసింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే అతడ్ని అరెస్ట్ చేశారు. విమానయాన సంస్థ నుంచి నివేదిక అందిన తర్వాత ఏవియేషన్ వాచ్‌డాగ్ తగిన చర్యలు తీసుకుందని, ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేపడుతోందని తెలిసింది.
Best Airlines: ప్రపంచంలోని టాప్-10 బెస్ట్ ఎయిర్‌లైన్స్
ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఒక స్టేట్‌మెంట్ కూడా విడుదల చేసింది. ‘‘జాన్ ఎఫ్. కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి కి వెళ్లిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 292 విమానంలో అంతరాయం చోటు చేసుకుంది’’ అని పేర్కొంది. రాత్రి 9 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి విమానం చేరుకోగా.. అంతకుముందే ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించడం జరిగింది. బాధిత ప్రయాణికుడు విమానయాన సంస్థకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడైంది. అయితే.. నిందితుడి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు.. తోటి ప్రయాణికుడిపై ఓ భారతీయుడు మూత్రం పోసినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని డిప్యూటీ కమిషనర్ దేవేశ్ కుమార్ వెల్లడించారు. ‘‘తమపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడని తమకు ఫిర్యాదులు కానీ, ఆధారాలు కానీ అందలేదు’’ అని ఒక స్టేట్‌మెంట్‌లో చెప్పుకొచ్చారు.
Kenya Cult Deaths: జీసస్‌ని కలిసేందుకు.. ఆకలితో 47 మంది మృతి
కాగా.. గత కొన్ని నెలల్లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. నవంబర్‌లో ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో ఒక వృద్ధురాలిపై మూత్రం పోసిన ఘటన.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నాటకీయ పరిణామాల నేపథ్యంలో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ 30 రోజుల పాటు నిషేధం కూడా విధించింది. గతేడాది డిసెంబర్‌లోనూ.. ఢిల్లీ నుంచి పారిస్‌కు బయలుదేరిన ఫ్లైట్‌లో తన పక్కనున్న ఖాళీ సీటుపై మూత్ర విసర్జన చేశాడు.
