Dallas Incident: గత వారం డల్లాస్ మోటల్ ఘటనలో, ప్రవాస భారతీయులు, కర్ణాటకు చెందిన చంద్రనాగమల్లయ్య హత్య ఎన్ఆర్ఐలో భయాలను పెంచింది. అత్యంత దారుణంగా నిందితుడు నాగమల్లయ్య తల నరికి, శరీరం నుంచి వేరు చేసి, దానిని కాలితో తన్నిన వీడియోలు వైరల్‌గా మారాయి. నిందితుడిని 37 ఏళ్ల క్యూబాకు చెందిన వలసదారులు యార్డానిస్ కోబోస్ మార్టినేజ్‌గా గుర్తించారు. నాగమల్లయ్యను ఆయన భార్య, కుమారుడి ముందే అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన, ప్రవాస భారతీయుల్లో భయాందోళనల్ని రేకెత్తించింది.
Read Also: September 17: ఆ రోజు అసలు ఏం జరిగింది.. నిజమైన చరిత్ర ఏంటి?
అయితే, ఈ ఘటనపై అమెరికా ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనను ఖండిస్తూ, గత జో బైడెన్ పాలనలో అక్రమ క్యూబన్ జాతీయుడై మార్టినేజ్ ను అమెరికాలో ఉండటానికి అనుమతించకపోతే ఈ దారుణమైన విషాదం జరిగి ఉండేది కాదని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ(DHS) పేర్కొంది. ‘‘ ఈ నీచమైన రాక్షసుడు భార్య, బిడ్డ ముందే ఒక వ్యక్తి తల నరికి, ఆయన తలని నేలపై తన్నాడు. యార్డానిస్ కోబోస్ మార్టినెజ్ మోటల్‌లో బాధితుడిని దారుణంగా హత్యకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కారణం’’ అని ఎక్స్‌లో రాసింది. అందుకే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నేరస్తులైన అక్రమ విదేశీయులపై కఠిన చర్యలు తీసుకుంటుందని, వీరిని మూడో దేశానికి తరలిస్తున్నామని DHS చెప్పింది.
సెప్టెంబర్ 10న డల్లాస్‌లో మోటల్ మేనేజర్ నాగమల్లయ్య దారుణహత్య జరిగింది. ప్రస్తుతం, నిందితుడు మార్టినెజ్‌ను అరెస్ట్ చేసి డల్లాస్ కౌంటీ జైలులో ఉంచారు. ఈ హత్యను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ‘‘మొదటి డిగ్రీ హత్య’’ అభియోగాలు మోపారు. వలస నేరస్తులపై తన ప్రభుత్వం సానుభూతి చూపదని అన్నారు.
