కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నది. రోజువారీ కేసులు లక్షల్లోనమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు నమోదవుతున్నా తీవ్రత తక్కువగా ఉండటంతో కరోనా బారిన పడినప్పటికీ త్వరగా కోలుకుంటున్నారు. అయితే, యూఏఈలో పనిచేస్తున్న ఓ భారతీయ ఫ్రంట్‌లైన్ వర్కర్ ఆరు నెలల క్రితం కరోనా బారిన పడ్డాడు. అప్పటి నుంచి కరోనాతో పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆసుపత్రిలో గత ఆరునెలలుగా చికిత్స పొందుతూ ఎట్టకేలకు కోలుకున్నాడు. గురువారం రోజున ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆరునెలలపాటు కరోనాతో పోరాటం చేయడంతో ఆసుపత్రి యాజమాన్యం ఆ వ్యక్తికి ఏకంగా రూ. 50 లక్షల రివార్డును ప్రకటించింది. అంతేకాదు, కరోనానుంచి కోలుకున్న అరుణ్‌కుమార్ నాయర్ భార్యకు కూడా ఉద్యోగం ఇచ్చింది ఆసుపత్రి యాజమాన్యం. కేరళ రాష్ట్రానికిచెందిన నాయర్ యూఏఈలోని అబుదాబిలో వీపీఎస్ హెల్త్‌కేర్ ఆపరేషన్ థియేటర్‌లో టెక్నీషయిన్‌గా పనిచేస్తున్నారు.
ఆరునెలలపాటు కరోనాతో పోరాడి విజయం సాధించిన భారతీయుడు…
