NTV Telugu Site icon

Palastina Refugees: పాలస్తీనా శరణార్థులకు భారత్ భారీ ఆర్థిక సహాయం.. ఎంతో తెలుసా..?

Un

Un

Palastina Refugees: పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితికి భారతదేశం మొదటి విడత 2.5 మిలియన్ యూఎస్ డాలర్లను రిలీజ్ చేసింది. ఐక్యరాజ్య సమితి కార్యాలయం ప్రతినిధి రిపోర్ట్స్ ప్రకారం.. భారత ప్రభుత్వం 2024- 25 సంవత్సరానికి 5 మిలియన్ల యూఎస్ డాలర్ల వార్షిక సహకారంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ (UNRWA)కి 2.5 మిలియన్ డాలర్ల మొదటి విడతను అందించింది. 1950 నుంచి నమోదిత పాలస్తీనా శరణార్థుల కోసం యూఎన్ఆర్డబ్ల్యూఏ (UNRWA) ప్రత్యక్ష సహాయాన్ని నిర్వహిస్తున్నట్లు భారతదేశం సోమవారం తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మధ్య ఇజ్రాయెల్ తన పని తీరును కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది.

Read Also: Astrology: జులై 16, మంగళవారం దినఫలాలు..

అయితే, ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన యుఎన్‌ఆర్‌డబ్ల్యుఏ సదస్సులో.. ఐక్యరాజ్య సమితి నిర్దిష్ట అభ్యర్థన మేరకు యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఏ)కు ఆర్థిక సహాయంతో పాటు అవసరమైన మెడిసిన్స్ కూడా అందజేస్తామని భారత్ ప్రకటించింది. సురక్షితమైన, సమయానుకూలమైన, నిరంతరంగా మానవతా సహాయం అందించాలనే మా ప్రధాన లక్ష్యం అని భారతదేశం వెల్లడించింది.యుఎన్‌ఆర్‌డబ్ల్యుఏ పూర్తిగా ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల నుంచి స్వచ్ఛంద విరాళాల ద్వారా నిధులు సమకూరుస్తుంది. కాగా, గత కొన్ని సంవత్సరాలుగా.. పాలస్తీనా శరణార్థులకు, వారి సంక్షేమానికి ఇండియా మద్దతుగా నిలుస్తుంది. భారతదేశం 2023-24 నాటికి విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపశమనం, సామాజిక సేవలతో సహా యూఎన్ ఏజెన్సీ ప్రధాన కార్యక్రమాలు-సేవల కోసం ఇప్పటి వరకు 35 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది.