Site icon NTV Telugu

India Russian Oil Imports: అమెరికాకు షాక్.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు పెంచనున్న భారత్..

Oil

Oil

India Russian Oil Imports: భారత్‌పై 50 శాతం టారిఫ్స్ విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గతంలో 25 శాతం సుంకాలు విధించగా.. ఆ తర్వాత అదనంగా మరో 25 శాతం జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి భారత్‌ ముడి చమురు కొనుగోలు చేసుకొని ప్రయోజనాలు పొందుతోందని ఆరోపిస్తూ ట్రంప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై యూఎస్ విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఇండియా కూడా కౌంటర్ ఎటాక్ చేస్తుంది. అమెరికా, యురోపియన్ యూనియన్ దేశాలు కూడా రష్యా నుంచి చాలా దిగుమతులు చేసుకుంటున్నాయని ఆరోపించింది. తాజాగా ట్రంప్ కి షాకిచ్చేలా ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read Also: Kamareddy: బీబీపేట పెద్ద చెరువుకు బుంగ.. విద్యా సంస్థలకు మరో రెండు రోజుల పాటు సెలవులు

అయితే, అమెరికా ఆగడాలకు భయపడేది లేదని.. అందుకోసమే, రష్యా నుంచి భారత్‌ ముడి చమురు దిగుమతులు మరింత పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. సెప్టెంబర్‌లో ఈ దిగుమతులు 10 నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే రోజుకు దాదాపు 3 లక్షల బ్యారెల్స్‌ను అదనంగా కొనుగోలు చేయాలని భారత్ ప్లాన్ వేసింది. ప్రస్తుతం భారత్‌.. రష్యా నుంచి 40 శాతం క్రూడ్ ఆయిల్‌ను మాత్రమే దిగుమతి చేసుకుంటోంది.. ఇందుకోసం రష్యా ఒక బ్యారెల్‌కు 2-3 డాలర్ల డిస్కౌంట్‌ కూడా అందజేస్తుంది.

Exit mobile version