NTV Telugu Site icon

India-China Border: భారత్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా.. 26 గస్తీ పాయింట్లు కోల్పోయామన్న అధికారి

India Lost 26 Patrol Points

India Lost 26 Patrol Points

India Lost 26 Patrol Points At Eastern Ladakh: భారత్-చైనా సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణం నెలకొంటూనే ఉంటుంది. భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రానికి ఓ సంచలన నివేదిక అందింది. అందులో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని.. స్వయంగా మన దేశానికి చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. భారత్‌ తూర్పు లద్దాఖ్‌లోని మొత్తం 65 గస్తీ పాయింట్లు ఉండగా.. అందులో 26 గస్తీ పాయింట్లను కోల్పోయిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం తూర్పు లద్దాఖ్‌ కారాకోరం పాస్‌ నుంచి చుమూర్‌ వరకు 65 పెట్రోలింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్లో భారత సాయుధ బలగాలు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలి. కానీ.. 26 చోట్ల(5-17, 24-32, 37)కు మన బలగాలు వెళ్లలేకపోతున్నాయి’’ అని లేహ్‌ ఎస్పీ పీడీ నిత్య ఆ నివేదికలో వెల్లడించారు. గత వారం ఢిల్లీలో జరిగిన పోలీస్ సదస్సులో ఆమె ఈ నివేదికను కేంద్రానికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ డోభాల్‌ కూడా పాల్గొన్నారు.

Padma Awards 2023: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

ఆ 26 చోట్ల భారత సాయుధ బలగాల గస్తీ నిర్వహణ లేకపోవడాన్ని సాకుగా చూపించి.. ఆ భూభాగాలను చైనా కలిపేసుకుంటోందని నిత్య ఆ నివేదికలో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు కొన్ని చోట్ల బఫర్‌ జోన్లను ఏర్పాటు చేయడం జరిగిందని.. అయితే వాటిని ఆసరాగా చేసుకొని సరిహద్దునను వెనక్కి నొడుతూ భారత్‌కు చెందిన ప్రాంతాలను చైనా ఆక్రమిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు.. భారత బలగాల కదలికల్ని గుర్తించేందుకు అక్కడి ఎత్తైనా శిఖరాలపై కెమెరాలను సైతం అమర్చినట్టు తెలిపారు. బఫర్‌ జోన్‌లోకి భారత సైన్యం ప్రవేశించిన వెంటనే.. ఆ ప్రదేశం తమ దేశానికి చెందినదేనంటూ చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఆ ప్రదేశం తమ భూభాగమని చైనా వాదిస్తోందని.. కొద్దిరోజుల నుంచి చైనా ఇలాగే ఏకపక్షంగా వ్యవహరిస్తూ వస్తోందని ఆమె తన నివేదినలో స్పష్టం చేశారు. కాగా.. చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నిస్తోందని భారత్‌ ఆరోపించిన నెలరోజులకే ఈ నివేదిక వెలుగులోకి రావడం గమనార్హం.

Lucknow Building Collapse: లక్నోలో కూలిన భవనం.. ఎస్‌పీ నేత తల్లి, భార్య దుర్మరణం

Show comments