India issues advisory: ఇజ్రాయిల్‌లోని భారత పౌరులకు కీలక సూచనలు..

Isreal

Isreal

India issues advisory: ఇజ్రాయిల్, హమాస్ మిలిటెంట్ల మధ్య భారీ యుద్దం జరుగుతోంది. అంతకుముందు ఈరోజు హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ ప్రాంతం నుంచి 5000 రాకెట్లను ఇజ్రాయిల్ పైకి ప్రయోగించారు. ఈ నేపధ్యంతో తాము యుద్ధం చేస్తున్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యహు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ లో ఉంటున్న భారత పౌరుల రక్షణ కోసం అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనల్ని జారీ చేసింది.

Read Also: Israel: “ఆపరేషన్ ఐరన్ స్వార్డ్” ప్రారంభం..మేం యుద్ధంలో ఉన్నామన్న ఇజ్రాయిల్..

×
×
Ad

యుద్ధస్థితి ప్రకటించబడినందున శనివారం భారతీయ పౌరులకు కొన్ని సూచనల్ని జారీ చేసింది. భారతీయులు అప్రమతంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్ పాటించాలని అధికారులు కోెరారు. దయచేసి జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని, భద్రత ఉండే ప్రాంతాలకు దగ్గర ఉండాలని రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయిల్ హోం ఫ్రంట్ కమాండ్ వెబ్సైట్ సందర్శించాలని, అత్యవసర పరిస్థితుల్లో వారి హెల్ప్‌లైన్ నంబర్ +97235226748 లేదా cons1.telaviv@mea.gov.in ఇమెయిల్‌ను సంప్రదించాలని ఎంబసీ అధికారులు పౌరులను కోరారు.