Site icon NTV Telugu

India Economy: ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా.. దిగజారిన బ్రిటన్ పరిస్థితి

Indian Economy

Indian Economy

India is the fifth largest economy, UK is sixth: అమెరికా, బ్రిటన్, చైనా ఇలా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దేశాల పరిస్థితి నెమ్మనెమ్మదిగా దిగజారుతోంది. దీంతో పాటు పలు దేశాలు మాంద్యం పరిస్థితుల్లోకి వెళుతున్నాయి. మరికొన్ని దేశాలు శ్రీలంక పరిస్థితికి దగ్గర్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఇలా ఉంటే ఇండియాలో మాత్రం ఆర్థిక మాంద్యం పరిస్థితులు వచ్చే అవకాశం దాదాపుగా ‘సున్నా’ అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దీంతో పాటు ఆర్థిక వృద్ధి రేటు కూడా 7 శాతానికి మించి ఉంటుందని ఐఎంఎఫ్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. బ్లామ్ బర్గ్ వంటి సంస్థలు కూడా ఇదే విషయాన్ని తెలుపుతున్నాయి.

ఇదిలా ఉంటే బ్రిటన్ ఇంకెంతో కాలం ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా కొనసాగదని తెలుస్తోంది. ఈ స్థానాన్ని భారత్ ఆక్రమించబోతోంది. ఇప్పటికే భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించినట్లు తెలుస్తోంది. యూఎస్ డాలర్ల ఆధారంగా లెక్కించినా.. ఐఎంఎఫ్ జీడీపీ గణాంకాల ప్రకారం ఇండియా మొదటి త్రైమాసికంలోనే తన ఆధిక్యాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సమస్యలు, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ ఇకపై భారత్ తరువాతి స్థానంలోనే ఉండబోతోంది. ప్రస్తుతం యూకేలో కొత్త ప్రధాని ఎన్నుకోవడం కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. లిస్ ట్రస్, రిషి సునక్ ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నారు. సెప్టెంబర్ 5న యూకేకి కాబోతున్న కొత్త ప్రధాని ఎవరనేది తెలుస్తుంది.

Read Also: Satyavathi Rathod: బీజేపీకి మూడో స్థానమే.. తెలంగాణలో ఆ పార్టీకి చోటు లేదు.

ద్రవ్యోల్భనం, పెరుగుతున్న మాంద్యం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రకారం 2024 వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే 7 శాతం గ్రోత్ రేటుతో దూసుకుపోతోంది. తొలి త్రైమాసికంలో నామమాత్రపు నగదు పరంగా భారత ఆర్థిక వ్యవస్థ పరిణామం 854.7 బిలియన్ డాలర్లుగా ఉంది.. ఇక బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమానం 816 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాదిలో భారత కరెన్సీతో పోలిస్తే పౌండ్ విలువ 8 శాతం పడిపోయింది.

అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. చైనా, జపాన్, జర్మనీ తరువాతి స్థానంలో ఇండియా, ఆరోస్థానంలో బ్రిటన్ ఉండబోతోంది. ఒక దశాబ్ధం క్రితం భారత్ 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది.. బ్రిటన్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది.

Exit mobile version