Site icon NTV Telugu

Srilanka Crisis: శ్రీలంకకు భారత్‌ ఆపన్నహస్తం.. 21 వేల టన్నుల ఎరువులు అందజేత

Srilanka Crisis

Srilanka Crisis

Srilanka Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఆపన్నహస్తం అందించి అండగా నిలుస్తోంది భారత్​. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారత్​తో మళ్లీ స్నేహ సంబంధాలకు హస్తం చాచింది కొలంబో. సంక్షోభంలో చిక్కుకున్న పొరుగుదేశమైన శ్రీలంకకు భారత్ సోమవారం 21,000 టన్నుల ఎరువులను అందజేసింది. కొలంబోలో ఉన్న భారత హైకమిషన్ దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేసింది. రెండు దేశాల మ‌ధ్య స్నేహం, స‌హ‌కారం కొన‌సాగుతోంద‌ని, భార‌త హై క‌మీష‌న‌ర్ 21 వేల ట‌న్నుల ఎరువులను శ్రీలంకకు అంద‌జేసిన‌ట్లు ఆ ట్వీట్‌లో తెలిపారు. గ‌డిచిన నెల‌లో శ్రీలంక‌కు భారత్ సుమారు 44 వేల ట‌న్నుల ఎరువులను స‌ర‌ఫ‌రా చేసింది ఇండియా. దీంతో ఇప్పటి వ‌ర‌కు సుమారు 4 బిలియ‌న్ల డాల‌ర్ల విలువైన స‌హాయాన్ని శ్రీలంక‌కు భారత్ అంద‌జేసింది.

శ్రీలంకకు వారి అవసరాలకు అనుగుణంగా ఆర్థిక సహాయాన్ని అందించడంలో భారతదేశం ముందంజలో ఉంది. అవసరమైన సమయంలో గరిష్ట మొత్తంలో సహాయం అందించిన దేశాలలో ఒకటి. 2022 ప్రారంభం నుండి శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక మంది శ్రీలంక వాసులు ఆహారం, ఇంధనంతో సహా నిత్యావసరాల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నందున, మార్చిలో శాంతియుత నిరసనలు ప్రారంభమయ్యాయి.ఆహారం, ఇంధన కొరతతో శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. ఇది ద్వీప దేశంలోని పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేస్తుంది. కొవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఆర్థిక వ్యవస్థ స్వేచ్ఛా పతనంలో ఉంది. శ్రీలంక విదేశీ మారకద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. ఇది ఆహారం, ఇంధనాన్ని దిగుమతి చేసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేయగా.. దీంతోపాటు దేశంలో విద్యుత్ కోతలకు దారితీసింది.

ISIS Plan To Attack In India: ఆత్మాహుతి దాడికి ఐసిస్ ప్లాన్.. టెర్రరిస్టును అరెస్ట్ చేసిన రష్యా

సంక్షోభ సమయంలో లంక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమ సింఘే ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆపత్కాలంలో ఆదుకున్న భారత ప్రభుత్వానికి లంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే ధన్యవాదాలు తెలిపారు. పొరుగు దేశాలకు ప్రాధాన్యం ఇస్తోన్న భారత్.. చిరకాల మిత్రుడు అయిన శ్రీలంకకు కూడా అనేక విధాలు సాయం అందిస్తోందని శ్రీలంకలోని భారత హైకమిషన్ వెల్లడించింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కనీవిని ఎరగని రీతిలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు.. భారత్ ఇప్పటి వరకూ దాదాపు 4 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం చేసింది.

Exit mobile version