Site icon NTV Telugu

అవినీతి రహిత దేశాల్లో భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా గత పదేళ్లలో అవినీతి నిర్మూలనలో పెద్దగా మార్పు కనిపించలేదని ‘ట్రాన్స్‌పరెన్నీ ఇంటర్నేషనల్’ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. కరోనా కట్టడి చర్యల కారణంగా గత రెండేళ్లుగా అవినీతి నియంత్రణ చర్యలకు ఆటంకం కలుగుతోందని సదరు సంస్థ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అవినీతి రహిత (అవినీతి లేకపోవడం) దేశాల ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ 85వ ర్యాంకులో నిలిచింది. దాయాది దేశం పాకిస్థాన్‌లో భారత్‌లో కంటే ఎక్కువ అవినీతి ఉందని సర్వే సంస్థ స్పష్టం చేసింది. పాకిస్థాన్ 140వ ర్యాంకులో ఉందని ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఈ ర్యాంక్ పెద్ద దెబ్బ అని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.

Read Also: దేశంలో భారీగా తగ్గిపోతున్న గాడిదల సంఖ్య.. కారణం ఏంటంటే?

అటు అవినీతి రహిత దేశాల విషయంలో తొలి స్థానంలో మూడు దేశాలు నిలవడం విశేషం. డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్‌లాండ్ దేశాలు సంయుక్తంగా ఒకటో స్థానంలో నిలిచాయి. తొలి పది ర్యాంకులు సాధించిన దేశాల్లో డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్‌లాండ్, నార్వే, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్, జర్మనీ ఉన్నాయి. 11వ స్థానంలో బ్రిటన్ ఉండగా.. అగ్ర దేశం అమెరికా 27వ ర్యాంకులో నిలిచింది. అత్యంత అవినీతి రహిత దేశంగా దక్షిణ సూడాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది. సోమాలియా, సిరియా దేశాలు సంయుక్తంగా దిగువ నుంచి రెండో స్థానంలో ఉన్నాయి.

Exit mobile version