India abstain on vote against China at UNHRC: ఐక్యరాజ్యసమితిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడూ ఉప్పూనిప్పుగా ఉండే భారత్-చైనాలు ఓ విషయంలో మాత్రం సహకరించుకున్నాయి. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులో మానవహక్కుల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి హక్కుల మండలిలో 51వ రెగ్యులర్ సెషన్ లో చైనాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణంపై భారత్ ఓటింగ్ కు గైర్హాజరు అయింది.
యూఎన్ మానవహక్కుల మండలిలో చైనా జిన్ జియాంగ్ ఉయ్ఘర్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో మానవహక్కుల పరిస్థితిపై చర్చ నిర్వహించడంపై ముసాయిదా తీర్మాణాన్ని తిరస్కరించబడిందని యూఎన్ ట్వీట్ చేసింది. ఇది పశ్చిమ దేశాలకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా కోర్ గ్రూపులో ఉన్న దేశాలైన కెనడా, డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, యూకే, యూఎస్ఏ, టర్కీ దేశాలు కూడా ఈ రిజల్యూషన్ కు మద్దతు ఇచ్చాయి.
Read Also: Karnataka: మసీదులో దసరా పూజ చేసే ప్రయత్నం.. 9 మందిపై కేసు
మొత్తం 47 దేశాలు ఉన్న యూఎన్ హక్కుల మండలిలో చైనా, పాకిస్తాన్, నేపాల్ వంటి 19 దేశాలు వ్యతిరేకంగా ఓటేయగా.. భారత్, మెక్సికో, బ్రెజిల్, ఉక్రెయిన్ తో సహా 11 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులో ఉయ్ఘర్ ముస్లింలకు వ్యతిరేకంగా చైనా దేశం అణిచివేతకు పాల్పడుతోందని ప్రపంచదేశాలు ఆరోపిస్తున్నాయి. మసీదులను కూల్చివేయడంతో పాటు అక్కడి ప్రజల బ్రెయిన్ వాష్ చేస్తున్నారని హక్కులకు భంగం కలుగుతుందని పలు వెస్ట్రన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. జిన్జియాంగ్ ప్రావిన్సులో ప్రజల హక్కులకు భంగం కలిగించేలా నేరాలు జరుగుతన్నాయి యూఎన్ ఆఫీస్ ఆప్ హ్యూమన్ రైట్స్(ఓహెచ్సీహెచ్ఆర్) కనుగొన్పప్పటికీ.. యూఎన్ హక్కుల మండలిలో మాత్రం దేశాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు.
యూఎన్ పరిణామంపై పలువురు హక్కుల కార్యకర్తలు స్పందిస్తున్నారు. అమ్నేస్టి ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్లామర్డ్ మాట్లాడుతూ.. యూఎన్ లో జరిగిన పరిణామం బాధితుల కన్నా మానవహక్కల ఉల్లంఘనకు పాల్పడే వారినే రక్షిస్తోందని అన్నారు. 2017 నుంచి చైనా జిన్జియాంగ్ ప్రావిన్సులో ఉయ్ఘర్ ముస్లింలు, కజఖ్, ఇతర ముస్లిం మైనారిటీలపై చైనా అణిచివేతకు పాల్పడుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెబుతూ.. చైనా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది.
