Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని షేక్ హసీనా విజయం సాధించారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో నాలుగోసారి హసీనా ప్రధాని పగ్గాలు చేపట్టబోతున్నారు. తిరిగి అధికారంలోకి వచ్చిన ఆమె ఎన్నికల విజయం తర్వాత మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్‌కి భారత్ గొప్ప స్నేహితుడు’’ అని ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడటమే కాకుండా, అనేక సమస్యలు పరిష్కరించుకున్నామని సోమవారం అన్నారు.
Read Also: India-Maldives row: ఇండియా-మాల్దీవ్స్ వివాదం మధ్యలో “ఇజ్రాయిల్”.. లక్షద్వీప్ గురించి కీలక ప్రకటన..
‘‘భారత్ 1971లో, 1975లో మనకు మద్దతు ఇచ్చారు. భారత్ నాతో పాటు నా సోదరికి, నా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు.’’ అంటూ వ్యాఖ్యానించారు. బంగ్లా జాతిపితగా భావించే షేక్ ముజిబుర్ రెహ్మాన్‌తో పాటు భార్య, వారి ముగ్గురు కుమారుల్ని1975లో అక్కడి ఆర్మీ హత్య చేసిన సమయంలో షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి ఆరేళ్ల పాటు భారత్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె భారత్‌కి ఎంతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. తాము భారత్‌ని తమ పక్కింటిగా భావిస్తున్నామని, మాకు సమస్యలు ఉన్నా వాటిని అద్భుతంగా పరిష్కరించుకున్నాము, భారత్‌తో మాకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని అన్నారు. మేము ప్రతీ దేశంలో మంచి సంబంధాలను కలిగి ఉన్నామని, అది మా నినాదం అని తెలిపారు.
