NTV Telugu Site icon

Elon Musk: ‘‘చేతకాని దద్దమ్మ’’..టెర్రర్ అటాక్‌పై జర్మనీ ఛాన్సలర్‌ని తిట్టిన మస్క్..

Elonmusk

Elonmusk

Elon Musk: క్రిస్మస్ పండగకి కొన్ని రోజుల ముందు జర్మనీలో ఉగ్రవాద దాడి చోటు చేసుకుంది. జర్మనీలోని మాగ్డేబర్గ్ నగరంలో విందు చేస్తున్న గుంపుపై కారు దూసుకెళ్లిన ఘటనపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. జర్మనీ ఛాన్సరల్ ఓలాఫ్ స్కోల్జ్‌ని దారుణంగా దూషించారు. ‘‘చేతకాని దద్దమ్మ’’ అంటూ స్కోల్జ్‌పై మస్క్ విరుచుకుపడ్డాడు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని శుక్రవారం మస్క్ డిమాండ్ చేశారు.

Read Also: Payal Shankar: బీజేపీ గురించి మాట్లాడితే ఏమైందో తెలుసు కదా..? కేటీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే కౌంటర్..

కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 68 మంది గాయపడ్డారు. జర్మనీలో ఎన్నికల ప్రచారంలోకి ఎలాన్ మస్క్ ప్రవేశించారు. జర్మనీని రైట్ వింగ్ పార్టీ AfD మాత్రమే రక్షించగలదని చెప్పారు. జర్మనీలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. స్కోల్జ్ నేతృత్వంలోని సెంటర్ లెఫ్ట్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఎలాన్ మస్క్ ఇప్పటికే యూరప్ అంతటా ఇతర ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక పార్టీలకు మద్దతు తెలిపారు. మస్క్ చాలా సార్లు రైట్ వింగ్ పార్టీకి మద్దతు తెలిపారు. జర్మన్ ప్రభుత్వ అక్రమ వలసల నిర్వహణపై విమర్శలు గుప్పించారు. అక్రమ వలసల్ని నిరోధించడానికి ప్రభుత్వ చర్యల చట్టబద్ధతను ప్రశ్నిస్తున్న ఇటాలియన్ న్యాయమూర్తులను తొలగించాలని గత నెల ట్రంప్ పిలుపునిచ్చాడు.

Show comments