Imran Khan: గత కొంత కాలంగా పాకిస్తాన్ వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు వార్తలు వెల్లువెత్తాయి. అవినీతి ఆరోపణలపై రావల్పిండిలోని అడియాలా జైలులో గత మూడేళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆచూకీ గత నాలుగు వారాలుగా కనిపించలేదు. ఆయనను కలిసేందుకు ఆయన చెల్లెళ్లను, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రికి కూడా అనుమతించకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. పీటీఐ కార్యకర్తలు, ఆయన అభిమానులు జైలు ముందు ధర్నాలు చేశారు. ఇమ్రాన్ సోదరీమణులు నిరసన తెలిపారు. అయితే, పోలీసులు తమ జట్టుపట్టుకుని ఈడ్చేశారని వారు ఆరోపణలు చేయడం సంచలనంగా మారాయి.
Read Also: Honda Cars: హోండా కార్లపై ఆఫర్ల వర్షం.. ఏకంగా రూ. 1.76 లక్షల డిస్కౌంట్
ఇదిలా ఉంటే, తాజాగా ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో కలిసేందుకు ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్‌కు అనుమతి లభించింది. ఇమ్రాన్ చనిపోయాడనే వార్తలు రావడంతో, ప్రభుత్వం ఆయన బతికే ఉన్నాడని ప్రకటన చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా, ఇమ్రాన్ చనిపోయినట్లు ఆఫ్ఘనిస్తాన్ సోషల్ మీడియా హ్యాండల్స్ నుంచి విస్తృతంగా ప్రచారం ప్రారంభమైంది. తాజాగా, అనుమతి ఇవ్వడంతో చనిపోయాడనే ప్రచారానికి చెక్ పడే అవకాశం ఉందని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, ఆగస్టు 2023 నుంచి జైలులో ఉన్నారు.
