Site icon NTV Telugu

Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. పిటిషన్ తిరస్కరించిన పాక్ హైకోర్టు.

Imran Khan

Imran Khan

Imran Khan’s plea against politics ban rejected by Pakistan court: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరస షాక్ లు ఇస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే అనేక కేసులు ఇమ్రాన్ ఖాన్ పై నమోదు అయ్యాయి. విదేశీ నేతల నుంచి తనకు లభించిన బహుమతులను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచిపెట్టినందుకు అక్కడి ఎన్నికల కమీషన్ ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఐదేళ్ల పాటు ప్రభుత్వ పదవిలో కొనసాగడానికి అనర్హుడిగా ప్రకటించింది. దీంతో ఆయన తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు.

Read Also: UK Prime Minister: బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌.. విజయం తథ్యం!

అయితే ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఆయన పాకిస్తాన్ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ఇమ్రాన్ ఖాన్ పిటిషన్ ను ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఇక ప్రధాని కలలు ఆవిరి అయ్యాయి. పాకిస్తాన్-తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్.. వ్యక్తులను అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి లేదంటూ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఐదేళ్ల అనర్హత ప్రస్తుత అసెంబ్లీ లోని ఐదేళ్ల కాలానికి వర్తిస్తుందా..? లేక పోతే పాకిస్తాన్ ఎన్నికల సంఘం తీర్పు వెల్లడించిన తేదీ నుంచి అనర్హత కాలం మొదలవుతుందా..? అనే దానిపై స్పష్టత రాలేదు.

ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ పదవీ కాలం ఆగస్టు 2018 నుంచి ప్రారంభం అయి 2023లో ముగుస్తుంది. 2018లొో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ అధికారిక పర్యటనల్లో అరబ్ దేశాల పాలకులు ఖరీదైన బహుమతులు ఇచ్చారు. ఇవి రాష్ట్ర రిపోజిటరీ తోషాఖానాలో జమచేస్తారు. అయితే వీటిని లాభాలకు విక్రయించినట్లు ఇమ్రాన్ ఖాన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ రూ. 21.56 మిలియన్లకు ఈ బహుమతులను సేకరించి.. రూ. 58 మిలియన్లకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా బహుమతుల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని వెల్లడించలేదని ఇమ్రాన్ ఖాన్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. అధికార సంకీర్ణ ప్రభుత్వం ఆయనపై కేసు ఫైల్ చేసింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా గుర్తించిన ఎన్నికల సంఘం ఆయనపై ఐదేళ్ల అనర్హతను ప్రకటించింది.

Exit mobile version