NTV Telugu Site icon

Imran Khan: తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కి విముక్తి.. శిక్షను సస్పెండ్ చేసిన హైకోర్ట్

Imran Khan

Imran Khan

Imran Khan: తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ దోషిగా శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఈ రోజు ఈ కేసుపై ఇస్లామాబాద్ హైకోర్టు విచారించింది. హైకోర్టు ఇమ్రాన్ ఖాన్ శిక్షను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

Read Also: Sharukh: బుర్జ్ ఖలీఫా సాక్షిగా జవాన్ ట్రైలర్…

తనకు విధించిన మూడేళ్ల శిక్షను నిలిపివేయాలని ఇమ్రాన్ ఖాన్ పెట్టుకున్న పిటిషన్ ని ఇస్లామాబాద్ హైకోర్టు ఈ రోజు విచారించింది. సోమవారం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు పడిన మూడేళ్ల శిక్షను సస్పెండ్ చేసింది. ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) న్యాయమూర్తుల డివిజనల్ బెంచ్, ప్రధాన న్యాయమూర్తి అమెర్ ఫరూక్ మరియు జస్టిస్ తారిఖ్ మెహమూద్ జహంగిరితో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఈ కేసుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది.

ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉన్న సమయంలో దేశ ప్రధానిగా ఇతర దేశాలు ఇచ్చిన బహుమతులను అక్రమంగా తన వారికి కట్టబెట్టినందుకు తోషాఖానా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Show comments