Site icon NTV Telugu

Imran Khan: నాకు న్యాయం జరగకుంటే నిరాహార దీక్ష చేస్తా..

Imran Khan

Imran Khan

Imran Khan: సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరగకపోతే నిరాహార దీక్షకు దిగుతానని పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్‌ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చీఫ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖాజీ ఫైజ్ ఇసా తన కేసులలో న్యాయం చేయడంలో ఫెయిల్ అయితే, హంగర్ దీక్షకు దిగుతానని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరికలు జారీ చేశారు.

Read Also: Pithapuram MLA Taluka : నెంబర్ ప్లేట్ పై ‘‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’.. ఆ ఒక్క చోట కాకుండా ఎక్కడైనా అంటూ..

కాగా, తమ పాకిస్తాన్‌ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీకి సంబంధించిన కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన సుప్రీం ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఇసా ఉండటంపై ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరగని పక్షంలో నిరాహార దీక్షకు దిగుతానని వార్నింగ్ ఇచ్చారు ఆయన. తమ పార్టీ కేసులను విచారించే బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి ఈసాను చేర్చడంపై పీటీఐ తరపున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారని ఇమ్రాన్‌ఖాన్‌ మీడియా సమావేశంలో తెలిపారు. తమకు న్యాయం జరగదని పీటీఐ తరపు న్యాయవాదులు నమ్ముతున్నారు.. అందుకే తమ కేసులను మరొకరు విచారించాలని ఇమ్రాన్ ఖాన్ కోరారు.

Exit mobile version