NTV Telugu Site icon

Imran Khan: హైకోర్టులో ఇమ్రాన్‌ ఖాన్‌ పిటిషన్.. సైనిక కస్టడీకి ఇవ్వొద్దని వినతి

Imrankhan

Imrankhan

పాకిస్థాన్‌లో గతేడాది మే 9న జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌సై సైనిక విచారణకు అవకాశం ఉందని రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తనను సైనిక కస్టడీకి అప్పగించకుండా అడ్డుకోవాలని కోరుతూ ఇస్లామాబాద్‌ హైకోర్టులో ఇమ్రాన్‌ ఖాన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి: Viswam Teaser: నీ యబ్బ.. గోపీచంద్ టీజర్ అదిరింది!

గత ఏడాది మే 9న అవినీతి కేసుకు సంబంధించి 71 ఏళ్ల పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ ఖాన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో పారామిలటరీ రేంజర్లు అరెస్టు చేసిన తర్వాత హింసాత్మక నిరసనలు చెలరేగాయి. అతని పార్టీ కార్యకర్తలు జిన్నా హౌస్ (లాహోర్ కార్ప్స్ కమాండర్ హౌస్), మియాన్‌వాలి ఎయిర్‌బేస్ మరియు ఫైసలాబాద్‌లోని ISI భవనంతో సహా డజను సైనిక స్థావరాలను ధ్వంసం చేశారు. రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌పై కూడా ఓ గుంపు దాడి చేసింది. ఈ కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ను సైనిక విచారణకు పిలిచే అవకాశం ఉందని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా హైకోర్టులో ఇమ్రాన్‌ఖాన్ పిటిషన్ వేశారు. న్యాయస్థానం ఏం తేలుస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Nivetha Thomas: ‘అయ్యో నివేదా.. ఏమైంది నీకు?’.. ఇలా అయిపోయావు ఏంటి?