Site icon NTV Telugu

Imran Khan: పాకిస్తాన్ మూడు ముక్కలు అవుతుంది..

Imran

Imran

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పదవి కోల్పోయినప్పటి నుంచి వరసగా భారత్ విదేశాంగ విధానాన్ని, పెట్రోల్ రేట్లు తగ్గించడంపై ప్రశంసిస్తున్నారు.తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం సరైన నిర్ణయాలు తీసుకోకుంటే పాకిస్తాన్ మూడు భాగాలుగా విడిపోయి.. అణ్వాయుధాలు లేని దేశంగా మారుతుందని అన్నారు.

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే.. ఈ దేశం నాశనం అవుతుందని నేను రాసిస్తానని అన్నారు. ముందుగా పాక్ ఆర్మీ నాశనం చేయబడుతుందని.. ఆ తరువాత పాక్ మూడు భాగాలుగా విభజించబడతుందని ఇమ్రాన్ అన్నారు. ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ నాశనం అయితే పాక్ డిఫాల్టర్ గా మారుతుందని.. 1990లో ఉక్రెయిన్ చేసినట్లు అణు నిరాయుధీకరణ చేయాలని ప్రపంచం పాకిస్తాన్ ను కోరుతుందని హెచ్చరించారు. పాక్ దివాళా తీస్తుందని అన్నాడు.

ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై పాక్ లోని రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. మాజీ అధ్యక్షడు ఆసిఫ్ అలీ జర్దారీ, దేశం ముక్కలు అవడం గురించి ఏ పాకిస్తానీ మాట్లాడడని..ఈ భాష పాకిస్తానీది కాదని..మోదీ అని విమర్శించారు. ముందు ధైర్యంగా ఉండండి, మీ కాళ్లపై నిలబడండి.. తరువాత రాజకీయాలు చేయడం నేర్చుకోండని ఆయన విమర్శించారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపాలని పిలుపు నిచ్చాడు జర్ధారీ. అధికారం కోల్పోయాక ఇమ్రాన్ ఖాన్ దేశం ముక్కలు కావడం అణ్వాస్త్రాలను కోల్పోవడం వంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు ముస్లింలీగ్ పార్టీ విమర్శించంది.

పాక్ పరిస్థితి ఇప్పడు దివాళా అంచున ఉంది. మరికొన్ని రోజుల్లో శ్రీలంక మాదిరిగా మారుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ
సమయం కూడా దగ్గరపడుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కష్టాల నుంచి బయటపడేందుకు పాక్ ఐఎంఎఫ్ ను ఆశ్రయించింది. ఐఎంఎఫ్ షరతులకు పాక్ ఓకే చెబుతుందో లేదో చూడాలి.

Exit mobile version