NTV Telugu Site icon

Bangladesh: బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ భావజాలం.. జాతిపిత, స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం ఉన్న జాతీయ సెలవుల రద్దు..

Bangladesh

Bangladesh

Bangladesh: పాకిస్తాన్ దారిలో బంగ్లాదేశ్ పయణిస్తోంది. ఆ దేశ జాతీయ సెలువు దినాలను ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. మార్చి 7, ఆగస్టు 15 వేడుకలతో సహా 8 జాతీయ దినోత్సవాలను రద్దు చేయాలని నిర్ణయించింది. బంగ్లాదేశ్ జాతిపితగా చెప్పబడే షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, 1971 స్వాతంత్ర్య సంగ్రామం స్పూర్తిపై దాడిగా ఈ నిర్ణయాన్ని పలువురు అభివర్ణిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయానికి సంబంధించి క్యాబినెట్ త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని యూనస్ ఫేస్‌బుక్ పేజీ బుధవారం పేర్కొంది.

అయితే, యూనస్ నిర్ణయంపై మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ విమర్శలు ప్రారంభించింది. ‘‘అక్రమ యూనస్ ప్రభుత్వం రీసెట్ బటన్ నొక్కడం ద్వారా బంగ్లాదేశ్ పుట్టుక చరిత్రకు సంబంధించి ప్రతీదాన్ని తొలగించాలని అనుకుంటుంది’’ అని పేర్కొంది. బంగ్లాదేశ్‌లో పాకిస్తానీ భావజాలాన్ని ప్రోత్సహించే చర్యగా దీనిని అభివర్ణించింది.

Read Also: Nawaz Sharif: గతాన్ని వదిలేసి కలిసుందా? భారత్‌-పాక్ సంబంధాలపై మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు

మార్చి 7 జాతీయ సెలవుదినాన్ని.. స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి ప్రజల్ని ప్రేరేపితం చేసిన షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రసంగాన్ని సూచిస్తుంది. ఆగస్టు 15 జాతీయ సంతాప దినం, ముజిబుర్ రెహమాన్ హత్యను సూచిస్తుంది. ఈ రెండూ కూడా బంగ్లా జాతిపితగా పేర్కొనే షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్‌కి చెందినవి. వీటిని తగ్గించే ప్రయత్నాన్ని ప్రస్తుతం యూనస్ ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో చేస్తోంది. షేక్ ముజిబుర్ రెహమాన్‌ని బంగ్లాదేశ్ జాతిపితగా గుర్తించడం లేదని, పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా పుట్టిన రోజును జరుపుకుంటోందని అవామీ లీగ్ విమర్శించింది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలపాలని పిలుపునిచ్చింది.

ఇదే కాకుండా, మార్చి 17న జాతి పిత ముజిబుర్ రెహ్మాన్ జన్మదినం, జాతీయ బాలల దినోత్సవం, నవంబర్ 4న విముక్తి యుద్ధం ఆకాంక్షలను జరుపుకునే రాజ్యాంగా దినోత్సవం ఉన్నాయి. వీటిన్నింటిని రద్దు చేయనున్నారు. షేక్ ముజిబుర్ రెహమాన్‌ని జాతిపితగా తాత్కాలిక ప్రభుత్వం గుర్తించడం లేదని, ప్రభుత్వంలోని తాత్కాలిక మంత్రి నహిద్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మన చరిత్ర 1952లో ప్రారంభం కాలేదు. మనకు 1947లో, ఆ తర్వాత 1971, 1990, 2024లో పోరాటాలు జరిగాయి. మనకు అనేక మంది జాతిపితలు ఉన్నారు. వారి సామూహిక పోరాటాల వల్లే మనకు స్వాతంత్రం వచ్చింది’’ అని అన్నారు. నహిద్ ఇస్లాం ఈ ఏడాది జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక పోరాటంలో షేక్ హసీనాకు వ్యతిరేకంగా పోరాడాడు.