NTV Telugu Site icon

Russia: ఉక్రెయిన్ డ్యామ్ కూల్చివేతతో ప్రపంచ ఆహార భద్రతపై ప్రభావం: ఐక్యరాజ్య సమితి

Ukraine Dam

Ukraine Dam

Russia: ఉక్రెయిన్లోని డ్ని్ప్రో నదిపై ఉనన కఖోవ్కా డ్యామ్‌ను కూల్చివేడయంతో ప్రపంచ ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని ఐక్యరాస్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. డ్యామ్‌ కూల్చివేత మూలంగా ఆహార పదార్థాల ధరల పెరుగుదలకు దారి తీస్తుందని వందలాది మందికి త్రాగునీటి సమస్యలు తలెత్తుతాయని ఐక్యరాఉ్యసమితి మంగళవారం పేర్కొంది. సోవియట్ కాలం నాటి భారీ ఆనకట్ట తెగిపోవడంతో సాగునీటికి, త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తనున్నాయని పేర్కొంది.

Read also: Earthquake In Jammu: జమ్మూకశ్మీర్‌లో భూకంపం.. ఉత్తర భారతదేశం అంతటా ప్రకంపనలు! భయాందోళనలో ప్రజలు

కఖోవ్కా జలవిద్యుత్ ప్లాంట్‌లో భాగమైన ఈ ఆనకట్ట జూన్ 6 తెల్లవారుజామున కూల్చివేయబడింది. డ్యామ్‌ను రష్యా పేల్చివేసిందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తుండగా.. ఉక్రెయిన్‌నే కూల్చివేసిందని రష్యా ఆరోపిస్తోంది. డ్యామ్‌ పేల్చివేతపై ఉక్రెయిన్, రష్యా రెండు దేశాలు పరస్పరం నిందలు వేసుకుంటున్నాయి. డ్యామ్‌ కూల్చివేత ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం ఉంటుందని యుఎన్ ఎయిడ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ బిబిసికి తెలిపారు. డ్యామ్‌ ఉక్రెయిన్‌కు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా బ్రెడ్‌బాస్కెట్‌లాంటిదని గ్రిఫిత్స్ చెప్పారు. తాము ఇప్పటికే ఆహార భద్రతపై ఇబ్బందుల్లో ఉన్నామని.. ఈ సందర్భంగా ఆహార ధరలు మరింత పెరుగుతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాని చెప్పారు.

Read also: Harish Rao: సిద్దిపేటలో మెగా జాబ్ మేళా.. యువతకు కొత్త భవిష్యత్తు ఇస్తుంది

తదుపరి పంట వేయడం, కోయడం కోసం నీటి సమస్య ఉంటుందని .. కాబట్టి ప్రపంచ ఆహార భద్రతపై భారీ ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ మరియు రష్యా ప్రపంచంలోని రెండు కీలక వ్యవసాయ ఉత్పత్తిదారులు మరియు గోధుమ, బార్లీ, మొక్కజొన్న, రాప్‌సీడ్, రాప్‌సీడ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ సీడ్ మరియు సన్‌ఫ్లవర్ ఆయిల్ మార్కెట్‌లో రెండు దేశాలు ప్రధానమైవన్నారు. డ్యాం వెనుక ఉన్న రిజర్వాయర్‌పై దాదాపు 700,000 మంది ప్రజలు తాగునీటి కోసం ఆధారపడి ఉన్నారని తెలిపారు. స్వచ్ఛమైన నీరు లేకుంటే ప్రజలు రోగాల బారిన పడతారని, అలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఎక్కువగా నష్టపోతారని చెప్పారు.