Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. బఖ్ ముత్ పట్టణంపై ఆధిపత్యం కోసం రష్యా తీవ్రదాడులు చేస్తోంది. ఒకవేళ ఈ పట్టణం రష్యా వశం అయితే ఇక ఉక్రెయిన్ కు లొంగిపోవడమే దిక్కు. రష్యన్ బలగాలు సునాయసంగా తూర్పు ప్రాంతాలపై ఆధిపత్యం కనబడిచే అవకాశం ఉంది. దీంతోనే బక్ ముఖ్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు రష్యాను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు పోరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే రష్యా మాజీ దౌత్యాధికారి బోరిస్ బోండారెవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యా ఓడిపోతే అధ్యక్షుడు పుతిన్ గద్దె దిగాల్సి వస్తుందని ఆయన అన్నారు. యుద్ధం వల్ల రష్యా చాలా నష్టపోయిందని అన్నారు. యుద్ధం ప్రారంభం అయినప్పుడు ఉక్రెయిన్ సునాయాసంగా ఓడిపోతుందని అంతా అనుకున్నారు, కానీ ఉక్రెయిన్ బలమైన రష్యాను ఎదుర్కొంటోందని తెలిపారు. పుతిన్ సూపర్ హీరో కాదని, అతడి స్థానంలో వేరే వారు కూడా రావచ్చని అన్నారు. పుతిన్ కేవలం సాధారణ నియంత అని అన్నారు. బోరిస్ బోండారేవ్ గతేడాది ఉక్రెయిన్ పై దాడికి నిరసనగా రాజీనామా చేశారు.
Read Also: Allu Arjun: ఆర్ఆర్ఆర్ పై బన్నీ ప్రశంసల వర్షం.. అందరి చూపు ఆ ఒక్క మాటమీదే
చరిత్రలో నియంతలు పదవి నుంచి దిగిపోవడం, వేరే వారు ఆ స్థానాన్ని భర్తీ చేయడం చూశామని, సాధారణంగా వారు యుద్ధంలో ఓడిపోతే, అతడి మద్దతుదారుల మద్దతు కోల్పోతాడని ఆయన అన్నారు. రష్యా యుద్ధం ఓడిపోతే పుతిన్ దేశానికి ఏ సమాధానం చెప్పలేడని అన్నారు. పుతిన్ అవసరం ఇకపై లేదని అతని మద్దతుదారులు అనుకోవచ్చని తెలిపారు.
మరోవైపు బక్ ముత్ కోసం ఇరు దేశాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. వందల్లో సైనికులు మరణిస్తున్నారు. బక్ ముత్ నగరం రష్యా చేతికి చిక్కితే, తూర్పు వైపుగా ఉక్రెయిన్ కు చక్కని రహదారిలా మారుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని ఆయుధాలు కావాలని అమెరికాతో పాటు పాశ్చత్య దేశాలు కోరుతున్నాడు.