If Imran Khan Had Remained PM There Would Have Been No Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ మాజీ ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) నేతృత్వంలోని ప్రభుత్వం, తమ దేశానికి ఎంతో ప్రమాదకరమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కొనసాగి ఉంటే.. అసలు పాకిస్తాన్ ఉనికి ఉండేది కాదని కుండబద్దలు కొట్టారు. ఇమ్రాన్ ప్రభుత్వం వల్లే ఇప్పుడు దేశంలో అత్యంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపణలు చేశారు. అంతేకాదు.. కేబినెట్ మీటింగ్‌లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌ని ఉద్దేశిస్తూ ఇమ్రాన్ ఖాన్ అసభ్యకరమైన పంజాబీ పదాన్ని ఉపయోగించారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఇమ్రాన్ ఆధ్వర్యంలోని ఒక మంత్రి.. ఇస్లామాబాద్‌లోని సౌదీ రాయబారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. అయితే.. ఆ మంత్రి పేరు మాత్రం రివీల్ చేయలేదు.
Smart Phone market: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఢీలా..27 శాతం తగ్గుదల
గతేడాది ఏప్రిల్‌లో పదవీచ్యుతుడైన తర్వాత అసెంబ్లీకి రాజీనామా చేయకుండా ఇమ్రాన్ ఖాన్‌ను అడ్డుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు బజ్వా బదులిస్తూ.. ‘‘మీరు ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిపోయారు, మీరు పోటీ పడేందుకు సిరీస్ ఇంకా ఉంది’’ అంటూ చెప్పారన్నారు. పార్లమెంటులో పీటీఐ, పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (PDM) మధ్య కేవలం రెండు ఓట్ల స్వల్ప తేడా మాత్రమే ఉందని.. బంగ్లాదేశ్‌లోని ఖలీదా జియా ఉదాహరణను ఉటంకిస్తూ, అసెంబ్లీకి రాజీనామా చేయవద్దని తాను ఇమ్రాన్‌కు సలహా ఇచ్చానని బజ్వా తెలిపారు. ఖిలీదా జియా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్లే వారి రాజకీయ పార్టీ భారీ నష్టాల్ని చవిచూసిందని తాను సూచించానని, రాజీనామా నిర్ణయం సరైంది కాదని తాను ఇమ్రాన్‌కు చెప్పానన్నారు. పార్లమెంట్‌లో కొనసాగితే, భవిష్యత్తుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని సూచించానని కూడా ఆయనన్నారు. అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ స్పందించలేదన్నారు.
John Kirby: పుతిన్‌ని ఒప్పించి.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోడీ ఆపగలరు
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పతనం అవ్వడంలో తన ప్రమేయం లేదన్న బజ్వా.. అతని ప్రభుత్వాన్ని రక్షించడం తాము చేసిన అతిపెద్ద తప్పని, స్వయంగా ఇమ్రాన్ తన ప్రభుత్వంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారని అన్నారు. తన స్వప్రయోజనాల కోసం తాను ఆలోచించి ఉంటే.. ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా కొనసాగి, ఇప్పుడు గౌరవంగా రిటైర్ అయ్యేవాడినని ఆయన పేర్కొన్నారు. కానీ.. అందుకు బదులుగా పాకిస్తాన్ మంచి కోసం తాను తన ప్రతిష్టను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నానని బజ్వా చెప్పుకొచ్చారు.