NTV Telugu Site icon

Israel: హమాస్ లెబనాన్‌ చీఫ్ ఫతే షెరీఫ్‌ కూడా హతం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన

Fatehsharif

Fatehsharif

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దూకుడు కొనసాగిస్తూనే ఉంది. కొద్ది రోజులుగా హిజ్బుల్లా లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. అగ్ర నేతలందరినీ ఒక్కొక్కరినీ అంతమొందిస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా ముఖ్య నాయకులంతా హతమయ్యారు. తాజాగా లెబనాన్‌లో హమాస్ అధిపతి ఫతే షెరీఫ్ కూడా హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఎక్స్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఇజ్రాయెల్‌ వైమానిక దళం జరిపిన దాడిలో ఉగ్రవాద సంస్థ హమాస్‌ లెబనాన్‌ అధిపతి ఫతే షెరీఫ్‌ ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేసింది. షెరీఫ్‌.. హిజ్బుల్లాతో కలిసి పని చేసేవాడని.. ఉగ్రవాదలను రిక్రూట్‌ చేసుకునేవాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) సోమవారం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Kolkata Rape Case: కోల్‌కతా హత్య కేసులో సీబీఐ, బెంగాల్ సర్కార్పై సీరియస్..

ఫతే షెరీఫ్.. లెబనాన్‌లో హిజ్బుల్లాతో కలిసి హమాస్‌ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తుండేవాడని.. లెబనాన్‌లో కొత్తగా రిక్రూట్‌మెంట్‌ చేయడం, ఆయుధాలను సమకూర్చడంలో సహాయం అందించేవాడని ఐడీఎఫ్‌ తెలిపింది. ఇజ్రాయెల్‌కు ముప్పు తలపెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఫతే షెరీఫ్‌ యునైటెడ్‌ నేషన్స్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్‌ ఏజెన్సీలో గుర్తింపు పొందిన సభ్యుడని.. లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ టీచర్స్ యూనియన్‌కు అధిపతి అని ఐడీఎఫ్‌ పేర్కొంది.

 

Show comments