Site icon NTV Telugu

Israel-Labnon: ఇజ్రాయెల్‌పై లెబనాన్ రాకెట్లు ప్రయోగం.. తిప్పికొట్టిన ఐడీఎఫ్ దళాలు

Labnon

Labnon

ఉత్తర ఇజ్రాయెల్‌పై లెబనాన్ 15 రాకెట్లు ప్రయోగించిందని ఐడీఎఫ్ వెల్లడించింది. కొన్ని రాకెట్లను అడ్డగించగా.. మరికొన్ని ఇజ్రాయెల్ భూభాగంలో పడ్డాయని తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది. అలాగే ఆస్తి నష్టాలు కూడా పెద్దగా జరగలేదని పేర్కొంది. ఐడీఎఫ్ డ్రోన్ రాకెట్ లాంచర్‌లను కూల్చివేసేసింది.

ఇదిలా ఉంటే దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లాతో అనుబంధంగా పని చేస్తున్న తైబే సంస్థ కమాండర్ మహ్మద్ హుస్సేన్ రమల్‌ను చంపినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా రమల్‌ ఉగ్రవాద కార్యకలాపాలను అమలు చేసినట్లుగా గుర్తించారు. దీంతో ఇజ్రాయెల్ దళాలు గురి చేసి అతన్ని చంపినట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: Harsha Sai : హర్ష సాయి కేసులో ఆర్జే శేఖర్ భాషా అరెస్టు?

ఇక గురువారం హమాస్ అధినేత యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ దళాలు అంతమొందించాయి. ఇది ఇజ్రాయైల్ సైన్యానికి నైతిక విజయం అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ తెలిపారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడికి కుట్ర పన్నింది సిన్వారేనని చెప్పారు. ఇజ్రాయెలీయులను బందీలుగా తీసుకుపోవడానికి సిన్వార్ కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నారు.

ఇక గాజా మైదానంలో పాలస్తీనా అధికారులు ఆశ్రయంగా పొందుతున్న పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు పిల్లలతో సహా కనీసం 28 మంది వ్యక్తులు మరణించారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. జబాలియాలో దాదాపు 100 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసర విభాగం తెలిపింది.

ఇది కూడా చదవండి: Yahya Sinwar: సిన్వార్‌ని చంపుతూ హీరోని చేసిన ఇజ్రాయిల్.. వీడియో రిలీజ్ చేసి తప్పు చేసిందా..?

Exit mobile version