NTV Telugu Site icon

IBM Layoff: ఉద్యోగులకు ఐబీఎం షాక్.. 3,900 మంది ఉద్యోగాలు ఊస్ట్..

Ibm

Ibm

IBM Cuts 3,900 Jobs In Latest Tech Layoffs: ఐటీ ఉద్యోగులను కంపెనీలు భయపెడుతున్నాయి. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో అని కంగారు పడుతున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి టెక్ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ జాబితాలో ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం కూడా చేరింది. తాజాగా 3,900 ఉద్యోగాలను తీసేస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని అసెట్ డివెస్ట్‌మెంట్‌లలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సంస్థ బుధవారం వెల్లడించింది. అయితే క్లయింట్-ఫేసింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ నియామకాల కోసం కట్టుబడి ఉన్నట్లు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జెమ్స్ కవనాగ్ వెల్లడించారు. ఐబీఎం వర్క్ ఫోర్స్ 1.5 శాతం ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ వెల్లడించింది.

Read Also: Facebook Down: అమెరికాలో ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ డౌన్..

ఇప్పటికే అమెజాన్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను తొలగించుకున్నాయి. ఆర్థికమాంద్యం పరిస్థితును బూచిగా చూపిస్తూ ఉద్యోగులను తొలగించాయి. ఖర్చులను తగ్గించుకునే యోచనతో కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. దేశీయ ఐటీ కంపెనీ విప్రో కూడా ఇటీవల ఫ్రెషర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెజాన్ 18,000 మందిని, మెటా 11,000, గూగుల్ 12,000, మెక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తాయనే వార్తలు ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, గత ఏడాది నవంబర్ నుండి దాదాపు యూఎస్ లో 2,00,000 మంది ఐటి ఉద్యోగులు తొలగించబడ్డారు. నివేదికల ప్రకారం తొలగించబడిన ఉద్యోగుల్లో 30 నుండి 40 శాతం మధ్య భారతీయ ఐటీ నిపుణులే ఉన్నారు. దీంతో ఇండియన్స్ లో కలవరం ప్రారంభం అయింది.