One Person Dying Of Hunger Every Four Seconds: ప్రపంచంలో ప్రస్తుత పరిణామలు తీవ్ర ఆహార సంక్షోభానికి దారి తీస్తున్నాయి. కోవిడ్ 19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై, ఆహార భద్రతపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చాలా దేశాలు ఆహార ధాన్యాల కొరతతో అల్లాడుతున్నాయి. పలు దేశాలు వారి ప్రజల ఆహార భద్రత కోసం ఎగుమతులను కూడా నిషేధిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచంలో ప్రతీ నాలుగు సెకన్లకు ఒకరు ఆకలితో మరణిస్తున్నారని 200 మందికి పై ఎన్జీవోలు మంగళవారం హెచ్చరించారు. ప్రపంచంలో ఆకలి సంక్షోభాన్ని ముగించాలని ప్రపంచ దేశాలు అందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
75 దేశాలకు చెందిన సంస్థలు ఈ సంక్షోభంపై చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను కోరుతూ.. బహిరంగ లేఖ రాశారు. 34.5 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఇది 2019 కన్నా ఎక్కువని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లో 5 కోట్ల మంది ప్రజలు ఆకలితో ఉన్నారని ఎన్జీవోలు తెలిపారు ప్రతీ రోజూ 19,700 మంది ప్రజలు ఆకలితో చనిపోతున్నారని.. అంటే నాలుగు సెకన్లకు ఒకరి చొప్పున ఆకలికి బలవుతున్నారని ఎన్జీవోలు అంచానా వేశారు. సోమాలియా వంటి దేశాలు ఇప్పటికే తీవ్ర ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని తెలిపారు.
Read Also: Chittoor Fire Accident: ఘోర ప్రమాదం.. ఆ నిర్లక్ష్యం ఖరీదు మూడు ప్రాణాలు
వ్యవసాయం, పంటపద్ధతుల్లో ఆధునిక సాంకేతికతను తెచ్చినా 21వ శాతాబ్ధంలో కరువు గురించి మాట్లాడుతున్నామని.. యెమెన్ ఫ్యామిలీ కేర్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాణాలు రక్షించేందు దీర్ఘకాలిక సహాయంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని ఎన్జీవోలు సూచించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తరువాత ప్రపంచ వ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతింది. దీంతో పాటు వాతావరణ మార్పలు కూడా వ్యవసాయ దిగుబడిపై ప్రభావం చూపిస్తోంది. చాలా దేశాల్లో నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమల కొరత ఏర్పడింది. ప్రపంచానికి ఎక్కువగా గోధుమల ఉక్రెయిన్, రష్యా నుంచే ఎగుమతి అవుతుంటాయి. అయితే ఇప్పడు ఈ రెండు దేశాలు యుద్ధంలో ఉండటంతో ప్రపంచం మొత్తం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.