Site icon NTV Telugu

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీ లైఫ్ పెర‌గాలంటే ఇలా చేయండి…

స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.  మొబైల్ ఫోన్స్‌లో ఎన్నో ఫీచర్లు అందుబాటులోకి వ‌చ్చినా, బ్యాట‌రీ సామ‌ర్ధ్యాన్ని పెంచే టెక్నాల‌జీని మొబైల్ ఫోన్ల సంస్థ‌లు అందుబాటులోకి తీసుకురాలేదు.  యడాపెడా మొబైల్ ఫోన్‌ల‌ను వినియోగిస్తే బ్యాట‌రీ సామ‌ర్ధ్యం త‌గ్గిపోతుంది.  బ్యాట‌రీ సామ‌ర్థ్యం పెర‌గాలి అంటే ఈ విష‌యాలు త‌ప్ప‌నిస‌రిగా ఫాలో కావాల్సిందే.

Read: ఆగస్టులో రానున్న గోపీచంద్-నయన్ సినిమా

మొబైల్ ఫోన్ లో బ్రైట్‌నెస్ ను త‌ప్ప‌నిస‌రిగా త‌గ్గించుకోవాలి.  బ్రైట్‌నెస్ ఎక్కువ‌గా ఉంటే వాల్ పేప‌ర్లు వాడ‌క‌పోవ‌డం వ‌ల‌న బ్యాట‌రీ సామ‌ర్థ్యం పెరుగుతుంది.  ఆటో బ్రైట్‌నెస్ ఆప్ష‌న్‌ను వినియోగించ‌డం వ‌ల‌న ప‌రిస్థితికి త‌గిన విధంగా బ్రైట్‌నెస్ ఆప్ష‌న్ మారిపోతుంది.  అంతేకాదు, అన‌వ‌స‌ర‌మైన యాప్స్ ను అధికంగా వినియోగించ‌డం వ‌ల‌న కూడా బ్యాట‌రీ సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంది.  బ్యాట‌రీ సేవ్ యాప్‌లు అనేకం అందుబాటులో ఉన్నాయి.  వాటిని తెలియ‌కుండా డౌన్‌లోడ్ చేసుకోవ‌డం వ‌ల‌న బ్యాట‌రీ సేవ్ మాట ఎలా ఉన్నా, సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంది.  స్క్రీన్ టైమ్ ఔట్‌ను 20 సెకన్ల వ‌ర‌కు పెట్టుకోవ‌డం మంచిది.  అవ‌స‌రం లేని స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రిగా ఇంట‌ర్‌నెట్‌ను ఆఫ్ చేశాలి.  నోటిఫికేషన్ల‌పై కూడా దృష్టి సారించ‌డం ఉత్త‌మం. 

Exit mobile version