ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తం ఆఫ్ఘనిస్తాన్, దానిని ఆక్రమించుకున్న తాలిబన్లపైనే ఉన్నది. 2001 నుంచి 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్‌కు అండగా నాటో దళాలు, అమెరికా దళాలు రక్షణ కల్పిస్తూ వచ్చాయి. ఆఫ్ఘన్ సైన్యానికి అధునాతన ఆయుధాలతో పాటుగా, ఎలా పోరాటం చేయాలనే ట్రైనింగ్‌ను ఇచ్చారు. కానీ, అవేమి తాలిబన్ల ముందు పనిచేయలేకపోయాయి. 20 ఏళ్లతో ఆఫ్ఘన్‌లో జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఏమౌతుందో అని భయపడుతున్నారు. 2001 నుంచి 2021 వరకు తాలిబన్లు పెద్దగా ప్రభావం చూపించకపోయినా, ఉనికిని చాటుకుంటూ వచ్చారు. తమ ఆదీనంలో ఉన్న ప్రాంతాల నుంచి ఆదాయం సమకూర్చుకోవడం మొదలుపెట్టారు. 2019-2020 సంవత్సరంలో తాలిబన్ల ఆదాయం 1.6 బిలియన్ల ఆదాయం సాధించింది అంటే అర్ధం చేసుకొవచ్చు. అక్రమ గనుల రవాణా, మాదక ద్రవ్యాల రవాణా, విదేశీ విరాళాలు, ఎగుమతులు, పన్నుల ద్వారా ఈ ఆదాయం సమకూర్చుకున్నారు. వారి ఆదీనంలో ఉన్న ప్రాంతాల్లోని గనుల నుంచి అధిక మొత్తంలో ఆదాయం సమకూర్చుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లో తాలిబన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవారు. ఈ వ్యాపారం ద్వారా కోట్ల రూపాయల డబ్బు వచ్చి చేరింది. ఈ మొత్తాన్ని తాలిబన్లు ఆయుధాలు సమకూర్చుకోవడానికి, తమ సంస్థ నిర్వాహణ కోసం ఈ నిధులను వినియోగిస్తున్నారు.
Read: కాబూల్ ఎయిర్‌పోర్ట్ మూసివేత… ఆందోళనలో ఆఫ్ఘన్ వాసులు…
