Site icon NTV Telugu

Terrorists: డిజిటల్ యుగంలో ఐసిస్ కొత్త ప్లాన్.. IS ఎలా మనుగడ సాగిస్తుందో తెలుసా?

Isi

Isi

Terrorists: సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక ఇస్లామిక్ స్టేట్ (IS) ఉగ్రవాద సంస్థ ప్రభావం ఉన్నట్లు తాజా విచారణలో తేలింది. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, దాడి చేసిన ఉగ్రవాదులు ఐఎస్‌కు విధేయులుగా ఉన్నట్లు ఆస్ట్రేలియా వార్త సంస్థలు నివేదించాయి. ఈ దాడిలో పాల్గొన్న వారిలో నవీద్ అనే అనుమానితుడు గతంలోనే ఐఎస్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఇక, ఉగ్రవాద నిరోధక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, ఐఎస్ఐఎస్ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికీ తన ప్రభావాన్ని కొనసాగిస్తోందన్న ఆందోళనలు మరింత పెరిగాయి.

Read Also: Insurance Stars : శరీరంలో అత్యంత ఆకర్షణీయమైన భాగానికి బీమా

అయితే, ఇస్లామిక్ స్టేట్ శక్తి గణనీయంగా తగ్గిపోయినప్పటికీ, ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధాల కారణంగా వారి ఉనికి పరిమితమైనప్పటికీ, ఉగ్రవాద సంస్థ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. తక్కువ నియంత్రణ ఉన్న డిజిటల్ వేదికలను వినియోగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ అనుచరులను చేరుకోవడం, వారిని రాడికలైజ్ చేయడం కోసం వ్యూహాత్మకంగా మార్పులు చేసుకుంటోంది.

Read Also: PM Modi: ఇథియోపియాలో ‘వందేమాతరం’.. పిల్లాడిలా మారిపోయిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

ఇక, ఐఎస్‌తో సంబంధం ఉన్న నెట్‌వర్క్‌లు ‘మ్యాట్రిక్స్ ఎకోసిస్టమ్’లోని వికేంద్రీకృత కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. మ్యాట్రిక్స్ అనేది సురక్షితమైన, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్‌తో కూడిన ఓపెన్ ప్రోటోకాల్. ఈ వ్యవస్థపై ఆధారపడిన ఎలిమెంట్, సిన్ని, టెక్‌హేవన్ లాంటి యాప్స్‌ను ఉగ్రవాదులు ప్రత్యామ్నాయ సమాచార మార్గాలుగా ఉపయోగిస్తున్నారు.

Read Also: Pakistan-BLA: పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడ్డ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).. 12 మంది సైనికులు మృతి..!

కాగా, ఈ యాప్స్ ప్రత్యేకత ఏమిటంటే, ఇవి వికేంద్రీకృత నెట్‌వర్క్‌లపై పని చేయడం వల్ల నిఘా సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీలు ఈజీగా పర్యవేక్షించలేకపోతున్నాయి. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ద్వారా గోప్యంగా సమాచారాన్ని పంచుకుంటూ, తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు ఐఎస్ ఈ డిజిటల్ వేదికలను ఆశ్రయిస్తోంది. అయితే, బోండి బీచ్ ఉగ్ర దాడి నేపథ్యంలో, టెర్రరిస్టు సంస్థలు టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నాయన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా భద్రతా సంస్థలు మరింత అప్రమత్తం అయ్యాయి.

Exit mobile version