Site icon NTV Telugu

The Sun: సూర్యుడు ఎలా, ఎప్పుడు చనిపోబోతున్నాడో తెలుసా..? పరిశోధకులు అంచనాలు ఇవే..

Sun

Sun

How And When Will The Sun Die?: సౌరకుటుంబానికి ప్రధాన ఆధారం సూర్యుడు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి, కాంతితోనే ఈ సమస్య సౌరకుటుంబం నిలబడి ఉంటోంది. ముఖ్యంగా భూమిలాంటి గ్రహానికి సూర్యుడు నుంచి వచ్చే శక్తి చాలా అవసరం. ఎందుకంటే ఇతర గ్రహాలతో చూస్తే ఒక్క భూమిపై మాత్రమే జీవజాలం ఉంది. సమస్త జీవజాలం బతకాలంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి అత్యవసరం. కిరణజన్య సంయోగక్రియ, భూమిని వెచ్చగా ఉంచడానికి సూర్యడు సహాయకారిగా ఉన్నారు. భూమిపై రుతువులు, వాతావరణం, సముద్ర ప్రవాహాలు ఇలా చాలా ప్రకృతి సంబంధ విషయాలు సూర్యుడితో ముడిపడి ఉన్నాయి. అయితే విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. ఎప్పుడో అప్పుడు ప్రతీ నక్షత్రం కూడా చనిపోవాల్సింది. అలాగే మన సూర్యుడు కూడా కొన్నేళ్లకు చనిపోవాల్సిందే. అయితే ఆ చావు ఎంత దారుణంగా ఉంటుందంటే.. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారక గ్రహాలను కబలించనున్నాడు. ఈ నాలుగు గ్రహాలను సూర్యుడు తనలో కలుపుకుంటాడు.

Read Also: Indigo Flight : హైదరాబాద్‌ నుంచి వెళ్లిన విమానానికి గోవాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం..

నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం.. సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం హైడ్రోజన్, హీలియం గ్యాస్ లతో సూర్యుడు ఏర్పడ్డాడు. అప్పటి నుంచి నిరంతరంగా కేంద్ర సంలీన చర్య వల్ల మండుతూనే ఉన్నాడు. దీని వల్ల సౌరకుటుంబానికి శక్తి అందుతోంది. ఇదిలా ఉంటే సైన్స్ అలర్ట్ ప్రకారం.. మరో 5 బిలియన్ ఏళ్ల తరువాత సూర్యుడు మరణించే అవకాశం ఉంది. ఇప్పటికే సూర్యుడు నడి వయస్సుకు చేరుకున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. సూర్యుడిలోని ఇంధనం అయిపోయిన తర్వాత రెడ్ జాయింట్ గా మారుతాడు. ఇప్పుడున్న సూర్యుడి సైజు అంగారకుడి దాకా పెరిగిపోతుంది. ఆ తరువాత సూర్యుడి కేంద్రకంలోకి కుచించుకుపోతాడు. అంటే సూర్యుడికి సుమారుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమిని కూడా సూర్యుడు కబలిస్తాడు.

మాంచెస్టర్ విశ్వవిద్యాలయం 2018లో ఒక అధ్యయనంలో కంప్యూటర్ మోడలింగ్ ఉపయోగించి.. 90 శాతం ఇతర నక్షత్రాల మాదిరిగానే సూర్యుడు కూడా చివరి రోజుల్లో రెడ్ జాయింట్ గా ఏర్పడి.. ఆ తరువాత తెల్లని మరగుజ్జు నక్షత్రంగా చివరగా నెబ్యులాగా మారి చనిపోతాడు. నక్షత్రం చనిపోయేటప్పుడు తనలోని ఇంధనాన్ని సమీప విశ్వంలోని వెదజిమ్ముతుంది. కేవలం నక్షత్రం కోర్ మాత్రమే 10,000 ఏళ్ల పాటు ప్రకాశవంతంగా కనిపించి ఆ తరువాత చల్లబడిపోతుంది.

Exit mobile version