Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..

  • రియాద్‌లోని అరామ్కో కేంద్రాన్ని టార్గెట్ చేశామన్న హౌతీలు.
  • బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్‌లతో దాడి చేసినట్లు ప్రకటన.
  • సౌదీ దాడులకు ప్రతీకారంగానే దాడి చేసినట్లు హౌతీల వాదన.
Saudi Arabia

Saudi Arabia

సౌదీ అరేబియాపై యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు విరుచుకుపడ్డారు. సౌదీ రాజధాని రియాద్‌పై దాడి చేశారు. రియాద్‌లోని సౌదీ అరామ్కోకు చెందిన ఓ కేంద్రంపై బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. యెమెన్ రాజధాని సనాపై సౌదీ దాడికి ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. శనివారం రియాద్‌లోని అరామ్కో కేంద్రం వద్ద దట్టమైన పొగ, మంటలు కనిపించినట్లు మీడియా నివేదించింది. అయితే, ఈ దాడిపై సౌదీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మధ్యప్రాచ్యంలో సౌదీ, ఇరాన్ మద్దతు కలిగిన హౌతీల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా సౌదీ లోని చమురు, ఇతర మౌలిక సదుపాయాల్ని టార్గెట్ చేస్తూ హౌతీలు దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అతిపెద్ద ఆయిల్ కంపెనీ అయిన సౌదీ అరామ్కోను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. గత వారం యాన్బులోని సౌదీ అరామ్కో‌పై క్షిపణులు, డ్రోన్లలో దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. అయితే, యాన్బుపైకి హౌతీలు ప్రయోగించిన 6 బాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డుకున్నట్లు సౌదీ ప్రకటించింది.