NTV Telugu Site icon

Hot Chocolate: విమానంలో హాట్‌ చాక్లెట్‌.. చిన్నారికి గాయాలు

Hot Chocolate

Hot Chocolate

Hot Chocolate: తన పదేళ్ల పాపతో కలిసి మహిళ విమానంలో ప్రయాణిస్తుండగా.. పాపకు హాట్‌ చాక్లెట్‌ కావాలని తల్లి కోరింది. విమాన సిబ్బంది పాప కోసం హాట్‌ చాక్లెట్‌ తీసుకొచ్చారు.. ఈ క్రమంలో వేడినీరు పాప శరీరంపై పడ్డాయి. దీంతో చిన్నారికి గాయాలయ్యాయి. వెంటనే కాలిన గాయాలకు విమాన సిబ్బంది ప్రథమ చికిత్సను చేశారు. అయితే విమాన సిబ్బంది వ్యవహారించిన తీరు తమకు నచ్చలేదని పాప తల్లి సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ఘటనపై ఎయిర్‌ హోస్టెస్‌, సిబ్బంది తమకు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని ఆరోపించింది. దీంతో సదరు విమాన సంస్థ సైతం స్పందించాల్సి వచ్చింది. ఇదంతా ఆగస్టు 11న జరిగింది.. ఎక్కడంటే..

Read also: Madhya Pradesh: రేప్ కేసులో పదేళ్లు జైల్లో ఉన్నాడు.. విడుదలై మళ్లీ అదేపని చేశాడు..

ఢిల్లీ (Delhi) నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌ (Frankfurt) వెళ్లే విస్తారా విమానంలో ఆగస్టు 11న రచనా గుప్తా తన పదేళ్ల కుమార్తెతో కలిసి ప్రయాణం చేశారు. . విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే రచనా తన కుమార్తెకు హాట్‌ చాక్లెట్‌ కావాలని విమాన సిబ్బందికి ఆర్డర్‌ చేశారు. మహిళ ఆర్డర్‌ మేరకు క్యాబిన్‌ సిబ్బంది చిన్నారికి వేడిపానీయాన్ని తీసుకొచ్చారు. వేడిపానీయం సర్వ్‌ చేస్తున్న క్రమంలో పొరపాటున చిన్నారిపై పడింది. దాంతో ఆ పాప చర్మం కాలి ఎర్రగా కందిపోయింది. ఈ ఘటనపై చిన్నారి తల్లి సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టింది… ఎయిర్‌హోస్టెస్‌ వల్ల తన పదేళ్ల పాపకు కాలిన గాయాలయ్యాయని తెలిపింది. ఈ విషయంలో సిబ్బంది సరిగా వ్యవహరించలేదని.. తమకు ఎయిర్‌ హోస్టెస్‌ కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని ఆరోపించింది. ప్రథమ చికిత్స చేయించి తమను ఓ అంబులెన్స్‌లో పంపించేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆఖరికి లగేజ్‌ను తరలించే విషయంలో కూడా వారు ఎలాంటి సాయం చేయలేదని మహిళ పోస్టులో తెలిపింది. చివరికి వైద్య ఖర్చులను కూడా తామే చెల్లించుకోవాల్సి వచ్చిందని పోస్టులో పేర్కొంది.

Read also: Shankar: సైలెంట్‌గా చేస్తున్నారు మావా… కానీ అప్డేట్ ఇవ్వడం లేదు!

విమానంలో జరిగిన ఘటనపై విమానయాన సంస్థ విస్తారా స్పందించింది. ఆగస్టు 11వ తేదీన ఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్తున్న యూకే25 విమానంలో ఓ దురదృష్టకర సంఘటన జరిగిందని ధృవీకరించారు… వేడి పానీయం ఓ చిన్నారి శరీరంపై పడటంతో గాయాలయ్యాయని తెలిపింది. విమాన క్యాబిన్‌ సిబ్బంది మహిళా అభ్యర్థన మేరకు చిన్నారికి హాట్‌ చాక్లెట్‌ అందించారని.. అయితే వేడి పానీయాన్ని సర్వ్‌ చేస్తున్న క్రమంలో చిన్నారి కదలడం వల్ల అదికాస్త చేయిజారి పడిపోయిందని తెలిపింది. ఘటన అనంతరం ఎయిర్‌లైన్స్‌ ప్రామాణిక పద్ధతులను అనుసరించి తమ సిబ్బంది బాలిక గాయానికి ప్రథమ చికిత్స చేశారు. విమానం ఫ్రాంక్‌ఫర్ట్‌లో ల్యాండ్‌ అయ్యే వరకూ పారామెడికల్‌ సిబ్బంది పాప పరిస్థితిని పర్యవేక్షించారని పేర్కొంది. చికిత్స అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌ ఏర్పాటు చేసి, ఆసుపత్రికి తరలించామని తెలిపిన సంస్థ.. అప్పటి నుంచి వారితో టచ్‌లోనే ఉన్నామని.. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ప్రకటించింది. చికిత్సకు అయిన వైద్య ఖర్చులు కూడా చెల్లిస్తామని వారికి తెలిపామని విస్తారా ఓ ప్రకటనలో వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ సేవలను మెరుగుపర్చుకుంటామని తెలిపిన సంస్థ.. ప్రయాణికుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యత అని విస్తారా సంస్థ ప్రకటించింది.