NTV Telugu Site icon

Hamas: ఇలాగే దాడులు చేస్తే బందీలు ‘‘శవపేటికల్లో వస్తారు’’.. ఇజ్రాయిల్‌కి హమాస్ వార్నింగ్..

Hamas

Hamas

Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో హమాస్ మిలిటెంట్లు బందీలను చంపడం మొదలుపెట్టారు. ఇటీవల గాజాలోని దక్షిణ ప్రాంతమై రఫాలోని భూగర్భ సొరంగాల్లో ఇజ్రాయిల్ సైన్యం ఆరుగురు బందీల మృతదేహాలను కనుగొంది. వీరిని అతి దగ్గర నుంచి తలలోకి కాల్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఇజ్రాయిల్ వ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. బందీలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహూని ప్రజలు నిందిస్తున్నారు. హమాస్‌తో బందీలను విడుదల చేసే ఒప్పందం చేసుకోవడంలో ఇజ్రాయిల్ ప్రధాని విఫలమయ్యారని ఆరోపించారు.

Read Also: IC 814: The Kandahar Hijack: నెట్‌ఫ్లిక్స్ “IC 814 హైజాక్” సిరీస్ బ్యాన్ చేయాలని హైకోర్టులో పిల్..

ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌ని ఉద్దేశిస్తూ హమాస్ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాగే సైనిక ఒత్తిడి కొనసాగిస్తే బందీలను ‘‘శవపేటికల్లో పంపిస్తాము’’ అని చెప్పారు. హమాస్ సాయుధ విభాగం ఎజెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబూ ఒబెయిడా ఒక ప్రకటనలో వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్-హమాస్ మధ్య ఒప్పందం కోసం ఖతార్, అమెరికా, ఈజిప్ట్ ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఈ చర్చల్లో కీలకమైన ఫిలడెల్ఫీ కారిడార్ ప్రతిబంధకంగా మారింది. ఈ ప్రాంతం నుంచి సైనికులను ఉపసంహరించుకోవాలని హమాస్ కోరుతుంటే, ఇజ్రాయిల్ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. తాను లొంగిపోయేది లేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరోసారి ప్రకటించారు.

అక్టోబర్ 07 దాడి తర్వాత గత ఏడాది కాలం హమాస్‌పై ఇజ్రాయిల్ యుద్ధం చేస్తోంది. ఈ దాడిలో హమాస్ మిలిటెంట్లు 1200 మంది ఇజ్రాయిలీలను ఊచకోత కోశారు. 240 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఈ దాడిలో అమాయకమైన 40 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. అయితే, హమాస్‌ని కూకటివేళ్లలో పెకిలించే వరకు తాము విశ్రమించేది లేదని పలుమార్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. దీంట్లో భాగంగానే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేతో పాటు దాని మిలిటరీ చీఫ్ మహ్మద్ డెయిఫ్‌ని హతం చేసింది. పలువురు కమాండర్లను తొలగిస్తోంది.