NTV Telugu Site icon

Hong Kong: హాంకాంగ్ మోడల్ దారుణ హత్య.. ఫ్రిజ్ లో కాళ్లు.. ఇంకా దొరకని తల

Abbay Choi

Abbay Choi

Hong Kong Model Case: హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ దారుణంగా హత్యకు గురైంది. మంగళవారం నుంచి కనిపించకుండా పోయిన ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుక్కున్నారు. తైపో జిల్లాలోని ఓ ఇంట్లో ఆమె కాళ్లను ఓ ఫ్రిజ్ లో ఉంచారు, ఆమె మృతదేహంతో పాటు మాంసం ముక్కలు, ఎలక్ట్రిక్ రంపాలు, పొడవాటి రెయిన్‌కోట్లు, చేతి తొడుగులు, ముసుగులను ఇంట్లో హాంకాంగ్ పోలీసులు గుర్తించారు. ఈ దారుణహత్యలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు సూప్ తయారు చేసే పాత్రలో మానవ కణజాలాన్ని పోలీసులు కనుగొన్నారు. అయితే అబ్బి చోయ్ తల ఇంకా దొరకలేదు.

Read Also: Kalvakuntla Kavitha: మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ భాగస్వామ్యం అవుతుంది

అబ్బి చోయ్ మాజీ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు ఆమె మాజీ భర్తతో పాటు అతని తల్లిదండ్రులు కూడా సాయపడ్డట్లు తెలుస్తోంది. దేశం వదిలిపారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె భర్త తుంగ్ చుంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోడల్ మిగతా భాగాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆస్తి తగదాలే హత్యకు కారణంగా తెలుస్తున్నాయి. అబ్బిచోయ్ కి సంబంధించిన ఆస్తిని దక్కించుకునేందుకు పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఈ హత్య ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్యను పోలి ఉంది. గతేడాది శ్రద్ధావాకర్ హత్య దేశంలో చర్చనీయాంశం అయిన సంగతి తెలసిందే. ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధాను హత్య చేసి శరీరాన్ని 35 భాగాలుగా చేసి, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పారేశాడు. శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో ఈ భయంకరమైన హత్య వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కూడా పోలీసులకు శ్రద్ధా తల ఇంకా దొరకలేదు.